AI Lawyer: ఉరిశిక్షపై సీజేఐ ప్రశ్న.. ‘ఏఐ లాయర్’ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్
ABN, Publish Date - Nov 07 , 2024 | 06:50 PM
భారత్ లో ఉరిశిక్షపై ప్రశ్నలు వేసి ఏఐ లాయర్ ను సుప్రీం సీజేఐ ఇరుకున పెట్టారు. తడుముకోకుండా అది ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో ఏర్పాటు చేసిన ఏఐ లాయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యూజియం ప్రారంభోత్సవానికి సుప్రీం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ లాయర్ పనితనాన్ని టెస్ట్ చేయాలని భావించారు. భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా? అని ప్రశ్నించారు. అది చెప్పిన సమాధానానికి సీజేఐ ఆశ్చర్యపోయారు.
అడ్వకేట్ టై, నల్ల కోటు ధరించి కళ్లద్దాలతో ఓ వ్యక్తి రూపంలో ఉన్న ఏఐ మెషీన్ సమాధానం చెప్పింది. "అవును, మరణశిక్ష భారతదేశంలో రాజ్యాంగబద్ధం. తీవ్ర స్థాయి నేరాల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయించిన అరుదైన కేసుల కోసం ఈ శిక్షను అమలు చేస్తారు అంటూ గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పింది. అది విని జస్టిస్ చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసిన కొత్త మ్యూజియం సుప్రీంకోర్టు ధర్మాన్ని, దేశానికి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు. మ్యూజియం యువ తరానికి ఇంటరాక్టివ్ స్పేస్‌గా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Kashyap Patel: ఎవరీ కశ్యప్ పటేల్.. ట్రంప్‌కు ఎలా నమ్మకస్తుడిగా మారారు
Updated Date - Nov 07 , 2024 | 06:51 PM