Ram Mandir: ఈ భూమిపై నా అంత అదృష్టవంతుడు లేడు.. రామ్‌లల్లా శిల్పి భావోద్వేగం
ABN, Publish Date - Jan 22 , 2024 | 05:47 PM
''ఈ భూమిమీద నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు'' అని రామ్‌లల్లా విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని మైసురుకు చెందిన యోగిరాజ్ తయారుచేసిన రామ్‌లల్లా విగ్రహం సోమవారంనాడు అయోధ్యలోని ఆలయ గర్భగుడిలో కొలువుతీరింది.
న్యూఢిల్లీ: ''ఈ భూమిమీద నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు'' అని రామ్‌లల్లా (Ram Lalla) విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) ఆనందం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని మైసురుకు చెందిన యోగిరాజ్ తయారుచేసిన రామ్‌లల్లా విగ్రహం సోమవారంనాడు ఆలయ గర్భగుడిలో కొలువుతీరింది.
''ఈ భూమ్మీద నా అంత అదృష్టవంతుడు మరొకరు లేరని భావిస్తున్నాను. మా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామచంద్రుని ఆశీస్సులు ఎల్లపుడూ నాతో ఉంటాయి. ఒక్కోసారి ఇదంతా కలలా అనిపిస్తోంది'' అని యోగిరాజ్ తన స్పందనను తెలియజేశారు. రామ్‌లల్లా విగ్రహం కోసం ముగ్గురు వేర్వేరు శిల్పులు వేర్పేరు శిలలతో 3 విగ్రహాలను చెక్కగా అందులో 51 అంగుళాల ఎత్తుతో యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠకు ఎంపిక చేశారు. తక్కిన రెండు విగ్రహాలను ఆలయంలో మరో చోట ఉంచుతారు. కృష్ణశిలతో యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో సోమవారంనాడు ప్రతిష్టించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి మోదీ చేతులమీదుగా క్రతువు ప్రారంభమై, మధ్యాహ్నం 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్న శుభముహూర్తాన బాలరాముడి ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలి హారతిని ప్రధాని మోదీ ఇచ్చారు.
Updated Date - Jan 22 , 2024 | 05:47 PM