ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

INDIA bloc: ఇండియా కూటమి నేతల వర్చువల్ మీట్... కీలక ఎజెండాలో ఆ రెండు

ABN, Publish Date - Jan 12 , 2024 | 07:17 PM

'ఇండియా' బ్లాక్ నేతలు ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు మావేశమవుతున్నారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరుగనుందని ఆయా పార్టీ వర్గాల సమాచారం. కన్వీనర్ పేరుపై చర్చ జరపడం, సీట్ల పంపకాల వ్యవహారంలో అనుసరించాల్సిన విధానంపై సంప్రదింపులు సాగించడం ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తోంది.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో 'ఇండియా' (.I.N.D.I.A.) బ్లాక్ నేతలు ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు సమావేశమవుతున్నారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరుగనుందని ఆయా పార్టీ వర్గాల సమాచారం. కన్వీనర్ పేరుపై చర్చ జరపడం, సీట్ల పంపకాల వ్యవహారంలో అనుసరించాల్సిన విధానంపై సంప్రదింపులు సాగించడం ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తోంది.


ఇండియా కూటమి గత చర్చల్లో కూడా 28 పార్టీల కూటమికి కన్వీనర్ ప్రస్తావన వచ్చింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరు బలంగా వినిపించింది. కూటమికి కార్యాలయం ఉండాలని, కూటమికి స్పోక్స్‌పర్సన్ ఉండాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. కూటమి నాలుగో సమావేశం ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన తీరుపై నితీష్ మనస్తాపంతో ఉన్నట్టు కూడా వినిపించింది. కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ పేరు ప్రతిపాదనకు వస్తుందనుకున్న తరుణంలో మల్లికార్జున్ ఖర్గే పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించడం జేడీయూను అసంతృప్తికి గురిచేసింది. సమావేశానంతరం నితీష్‌, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఏమాత్రం ఉత్సాహంగా కనిపించలేదు.


లోక్‌సభ ఎన్నికలు 2024

18వ లోక్‌సభకు వచ్చే ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. 17వ లోక్‌సభ పదవీకాలం జూన్‌తో ముగియనుంది. గత లోక్‌సభ ఎన్నికలు 2019 ఏప్రిల్-మేలోనే జరిగాయి. ఎన్నికల అనంతరం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా కొనసాగారు.

Updated Date - Jan 12 , 2024 | 07:18 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising