ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Meenakshi Lekhi: ఇండియా మీ తల్లికాదా? యువజన సదస్సులో సహనం కోల్పోయిన మీనాక్షి లేఖి..

ABN, Publish Date - Feb 03 , 2024 | 07:38 PM

కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారంనాడు కేరళలోని కోజికోడ్ లో జరిగిన యువజన సదస్సులో సహనం కోల్పోయారు. తన ప్రసంగానంతరం ''భారత్ మాతా కీ జై'' అంటూ నినాదం ఇస్తున్న సమయంలో ఆడియెన్స్‌లో ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న ఓ మహిళను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరారు.

కోజికోడ్: కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) శనివారంనాడు కేరళలోని కోజికోడ్ (Kozhikode)లో జరిగిన యువజన సదస్సు (Youth Conclave)లో సహనం కోల్పోయారు. తన ప్రసంగానంతరం ''భారత్ మాతా కీ జై'' అంటూ నినాదం ఇస్తున్న సమయంలో ఆడియెన్స్‌లో ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న ఓ మహిళను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరారు. ఇండియా పట్ల గౌరవం లేనివారు యూత్ కాంక్లేవ్‌లో ఉండనవసరం లేదని తెగేసిచెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.


కోజికోడ్‌లో కొన్ని రైట్-వింగ్ సంస్థలు ఈ యువజన సదస్సును నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న మీనాక్షి లేఖి... తాను ''భారత్ మాతా కీ జై'' నినాదం ఇచ్చినప్పుడు అంతా తనతో వంత పాడాలని ఆడియెన్స్‌ను పదేపదే కోరారు. అయితే, ఒక వైపు నుంచి ఎలాంటి నినాదాలు రాకపోవడంతో పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళను నిలదీశారు. 'భారత్ మాతా కీ జై' అనడం ఇబ్బందిగా అనిపిస్తే సదస్సు నుంచి వెళ్లిపోవాలని అన్నారు. "కొందరు చేతులు కట్టుకుని కూర్చుండిపోతున్నారు. ఈవైపు బలహీనంగా అనిపిస్తోంది. అసలు సమస్య ఏమిటి?" అని అడిగారు. పసుపరంగు చీరలో ఉన్న మహిళను సీట్లోంచి లేవాలని కోరారు. ''భారత్ (మాత) మీ తల్లి కాదా?'' అని ఆమెను సూటిగా ప్రశ్నించారు. మీరు సభ నుంచి వెళ్లిపోవడమే సరైనదని ఆమెకు సూచించారు. దేశాన్ని గర్వంగా చెప్పుకోలేని వారు, ఇండియా గురించి మాట్లాడటానికి వెనుకాడే వాళ్లు యువజన సదస్సులో ఉండాల్సిన అవసరం లేదని లేఖి వ్యాఖ్యానించారు. కాగా, మీనాక్షి లేఖి వీడియోకు సోషల్ మీడియాలో స్పందనలు వస్తున్నాయి. కొందరు మీనాక్షి లేఖిని సమర్ధించగా, మరికొందరు కేరళలో చాలా మందికి అంతగా హిందీ తెలియదని, కేంద్ర మంత్రి సహనం కోల్పోయి మాట్లాడటం సబబు కాదని మరికొందరు వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 03 , 2024 | 07:38 PM

Advertising
Advertising