ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ravi River: పాకిస్తాన్‌కి కోలుకోలేని దెబ్బ.. రావి నది నీరు పూర్తిగా నిలిపివేత

ABN, Publish Date - Feb 25 , 2024 | 07:26 PM

ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు (Pakistan) తాజాగా భారత్ మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది. రావి నదిపై (Ravi River) షాపూర్ కంది బ్యారేజీ (Shahpur Kandi Barrage Dam) నిర్మాణాన్ని పూర్తి చేసి.. పాక్‌కు ఆ నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. ఇప్పుడు ఆ నీరుని జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) కథువా, సాంబా జిల్లాల్లో సాగునీరుగా మళ్లించనున్నారు.

ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు (Pakistan) తాజాగా భారత్ మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది. రావి నదిపై (Ravi River) షాపూర్ కంది బ్యారేజీ (Shahpur Kandi Barrage Dam) నిర్మాణాన్ని పూర్తి చేసి.. పాక్‌కు ఆ నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. ఇప్పుడు ఆ నీరుని జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) కథువా, సాంబా జిల్లాల్లో సాగునీరుగా మళ్లించనున్నారు. దాదాపు 1150 క్యూసెక్కుల నీరుని ఈ ప్రాంతాలకు అందనుంది. దీంతో.. ఆ ప్రాంతాల్లో వ్యవసాయ అవకాశాలు మరింత పెరగనున్నాయి. మొత్తం 32,000 హెక్టార్ల భూమికి ప్రయోజనం చేకూరనుంది. ఈ బ్యారేజీని పంజాబ్‌ (Punjab) రాష్ట్రం పఠాన్‌కోట్ జిల్లాలో రావి నదిపై నిర్మించారు.


గతంలో 1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం.. రావి నది నీటిలోని కొంత భాగం లఖన్‌పూర్ ఆనకట్ట (Lakhanpur Dam) ద్వారా పాకిస్తాన్‌లోకి ప్రవహించేది. అయితే.. షాపూర్ కంది బ్యారేజీ ఈ ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేస్తుంది. ఆ నీటిని ఇప్పుడు భారత్ సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ చర్యతో రావి, సట్లెజ్, బియాస్ నదులపై భారత్ ప్రత్యేక నియంత్రణను పొందుతుంది. అయితే.. సింధు, జీలం, చీనాబ్ నదుల నిర్వహణ మాత్రం పాకిస్తాన్ చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనా.. రావి నది నీరుని పాక్‌కు ప్రవహించకుండా నిలిపివేయడం, భారతదేశంలో నీటి నిర్వహణలో వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. దీని వల్ల జమ్ముకశ్మీర్‌లోని ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

నిజానికి.. ఈ షాపూర్ కంది బ్యారేజ్ ప్రాజెక్ట్ 1950ల్లోనే ప్రారంభించబడింది. కానీ.. దీని నిర్మాణం 1992 వరకు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. చివరికి 1995లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు (PV Narasimha Rao) పునాది రాయి వేశారు. అయితే.. జమ్ముకశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాల మధ్య విభేదాల కారణంగా ఇది ఆలస్యమైంది. ప్లాన్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ 2002లో పూర్తి కావాల్సింది. కానీ.. నిధులు, భూసేకరణ, పర్యావరణ సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఇది ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్‌గా 2018 డిసెంబర్‌లో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. 2022లో పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.3300 కోట్లు.

Updated Date - Feb 25 , 2024 | 07:26 PM

Advertising
Advertising