Internet: త్వరలోనే కొత్త ఇంటర్నెట్.. ఏ మూలకైనా అదిరిపోయే సిగ్నల్..
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:18 PM
వేలం లేకుండా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా శాటిలైట్ కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయించే ప్రత్యామ్నాయ మార్గాలపై అభిప్రాయాలను కోరుతోంది. మొత్తం 21 అంశాలపై..
మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్, వైర్ లెస్ ఇలా రకరకాల ఇంటర్నెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇవ్వన్నీ పనిచేయాలంటే ఆయా సంస్థలకు సంబంధించిన టవర్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తాయి. సిగ్నల్ తక్కువుగా ఉంటే ఇంటర్నెట్ స్లోగా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఉన్నప్పటికీ స్పీడ్ తక్కువుగా ఉంటుంది. దీంతో ట్రాయ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం స్పెక్ట్రమ్ కేటాయింపు, ధరల నిర్ణయంపై ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. దేశంలోని ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న కొన్ని సంస్థలకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అనుమతి లభించనుంది. టెలికాం చట్టం 2023 ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ ద్వారా వేలం లేకుండా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా శాటిలైట్ కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయించే ప్రత్యామ్నాయ మార్గాలపై అభిప్రాయాలను కోరుతోంది. మొత్తం 21 అంశాలపై అభిప్రాయాలను ఆహ్వానించింది. స్పెక్ట్రమ్ ఛార్జీలను నిర్ణయించే పద్ధతి, శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లు, స్పెక్ట్రమ్ కేటాయింపు మొదలైనవి ఇందులో ఉన్నాయి.
వేలం లేకుండా..
ట్రాయ్ టెలికం సంస్థలకు వేలం ద్వారా స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తూ వస్తోంది. తాజాగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి స్పెక్ట్రమ్ కేటాయింపును వేలం ప్రక్రియ ద్వారా కాకుండా అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామాల్లో వేగవంతమైన అంతర్జాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. నేరుగా శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ రావడం ద్వారా టవర్లతో సంబధం లేకుండా ఏ ప్రాంతంలో అయినా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే మొబైల్, టీవీ, ఇంటర్నెట్ సేవలు సరసమైన ధరల్లో లభించనున్నాయి.
వేగంగా ఇంటర్నెట్ సేవలు..
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే భారత దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలపడనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ కంటే వేగవంతమైన స్పీడ్‌తో అంతర్జాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ధరలను ట్రాయ్ త్వరలోనే ప్రకటించనుంది. శాటిలైట్ ఇంటర్నెట్‌తో సేవలు అందుబాటులోకి వస్తే ఎటువంటి వైర్లతో సంబంధం లేకుండా వైర్ లెస్ట్ సేవలు అందనున్నాయి. కనీసం 12 నుంచి 150 ఎంబీపీఎస్ వేగంతో ఈ ఇంటర్నెట్ సేవలు అందించనుంది.
Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Sep 28 , 2024 | 04:18 PM