ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indigo Flight: ల్యాండింగ్‌కి ముందు అంధుడైన పైలట్.. ఆ తర్వాత ఏమైందంటే?

ABN, Publish Date - Feb 25 , 2024 | 04:09 PM

కోల్‌కతా విమానాశ్రయంలో (Kolkata Airport) ఓ ఆందోళనకరమైన సంఘటన వెలుగు చూసింది. విమానాన్ని సరిగ్గా ల్యాండ్ చేస్తున్న సమయంలో.. పైలట్ (Pilot) కొద్దిసేపు అంధుడయ్యాడు. ఇందుకు కారణం.. లేజర్ కిరణాలే (Laser Beam). ల్యాండింగ్‌కి ముందు పైలట్ కళ్లలో లేజర్ కిరణాలు పడటంతో.. కాసేపు అతని కళ్లు మసకబారాయి.

కోల్‌కతా విమానాశ్రయంలో (Kolkata Airport) ఓ ఆందోళనకరమైన సంఘటన వెలుగు చూసింది. విమానాన్ని సరిగ్గా ల్యాండ్ చేస్తున్న సమయంలో.. పైలట్ (Pilot) కొద్దిసేపు అంధుడయ్యాడు. ఇందుకు కారణం.. లేజర్ కిరణాలే (Laser Beam). ల్యాండింగ్‌కి ముందు పైలట్ కళ్లలో లేజర్ కిరణాలు పడటంతో.. కాసేపు అతని కళ్లు మసకబారాయి. అయితే.. విమానం సురక్షితంగానే ల్యాండ్ అయ్యింది. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కానీ.. పైలట్ కళ్లలో లేజర్ కిరణాలు పడటంతో ఎయిర్‌లైన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన లేజర్ లైట్స్ వల్ల కలిగే ప్రమాదాల్ని హైలైట్ చేసింది.


ఆ వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు (Indigo Airlines) చెందిన 6E 223 విమానం బెంగళూరు (Bengaluru) నుంచి కోల్‌కతాకు (Kolkata) బయలుదేరింది. ఇందులో ఆరుగురు సిబ్బందితో పాటు 165 మంది ప్రయాణికులు ఉన్నారు. కోల్‌కతా విమానాశ్రయం వరకూ ఎలాంటి సమస్యలు లేకుండా ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ.. సరిగ్గా ల్యాండింగ్ సమయంలో ఓ ఊహించని ఘటన జరిగింది. ఎయిర్‌పోర్టుకి కిలోమీటర్ల దూరంలో ఉండగా.. లేజర్ కాంతి కిరణాలు కాక్‌పిట్‌లోని పైలట్ కళ్లను తాకాయి. ఆ దెబ్బకు పైలట్ కళ్లు కాసేపు మసకబారాయి. దాంతో.. ఆ పైలట్ ఏమీ చూడలేని పరిస్థితి నెలకొంది. అలాంటి స్థితిలోనూ పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సాధారణంగా.. కళ్లలో ఇలా లేజర్ కాంతి కిరణాలు పడినప్పుడు చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్లిష్టమైన దశలో పైలట్‌లు సురక్షితంగా నావిగేట్ చేయడం కష్టమవుతుంది. ఇలాంటప్పుడు పైలట్‌లు ల్యాండింగ్‌ని నిలిపివేసి.. సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు గాను గో-అరౌండ్ విధానాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ అలాంటి విధానాన్ని అవలంభించకుండానే పైలట్ సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ఏదేమైనా.. ఈ లేజర్ లైట్ చర్యపై ఇండిగో యాజమాన్యం సీరియస్ అయ్యింది. దీనిపై పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. విమాన ప్రమాదాలు, లేజర్‌ లైట్ల సమస్యలపై ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 25 , 2024 | 04:09 PM

Advertising
Advertising