ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇస్రో.. టార్గెట్‌ 25

ABN, Publish Date - Mar 07 , 2024 | 06:28 AM

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) చేపట్టాల్సిన ప్రయోగాలకు సంబంధించి 25 ఏళ్ల కాలానికి దార్శనిక పత్రాన్ని రూపొందించామని ఆ సంస్థ చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు. చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేయాలని, జాబిల్లిపైకి

చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు

వ్యోమగామిని పంపడమే లక్ష్యం

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

విజయవాడ కల్చరల్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) చేపట్టాల్సిన ప్రయోగాలకు సంబంధించి 25 ఏళ్ల కాలానికి దార్శనిక పత్రాన్ని రూపొందించామని ఆ సంస్థ చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు. చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేయాలని, జాబిల్లిపైకి భారత వ్యోమగామిని పంపాలని ఈ పత్రంలో పొందుపరిచామని చెప్పారు. దీంతోపాటు శుక్రుడు, అంగారకుడుపై కూడా ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం జరిగిన డాక్టర్‌ పిన్నమనేని, సీతాదేవి ఫౌండేషన్‌ 30వ వార్షికోత్సవంలో సోమనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు డాక్టర్‌ పిన్నమనేని, సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్‌-3 విజయం వెనుక కొన్ని తరాల కృషి ఉందని.. ఆ ఫలితాన్ని తాము అనుభవిస్తున్నామని వెల్లడించారు. ఇస్రోలో అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు పనిచేశారని, వాళ్లే తనకు గురువులు, మార్గదర్శకులు అని చెప్పారు. ఇస్రోలో తాను తొలుత ఎస్‌ఎల్వీ, ఆ తర్వాత పీఎ్‌సఎల్వీ, ఎల్‌ఎ్‌సఎం ప్రాజెక్టుల్లో పనిచేశానని, ఈ మూడు ప్రాజెక్టుల్లో కలిగిన అవగాహన, స్ఫూర్తి, కృషి చంద్రయాన్‌-3 విజయవంతం కావడానికి కారణమయ్యాయని చెప్పారు.చంద్రుడిపై నీటి జాడలను ప్రపంచంలో తొలిసారిగా కనుగొన్నది మనమేనని స్పష్టం చేశారు. తాను ఎల్వీఎం-3 ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు రాకెట్‌ను డిజైన్‌ చేశానని చెప్పారు.

Updated Date - Mar 07 , 2024 | 06:38 AM

Advertising
Advertising