ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PSLV C-59: పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం వాయిదా

ABN, Publish Date - Dec 04 , 2024 | 03:40 PM

ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-59 ప్రయోగం వాయిదా పడింది. దీనిపై ఇస్రో కీలక ప్రకటన చేసింది.

PSLV C-59

శ్రీహరికోట: ఇవాళ సాయంత్రం 4:08 గంటలకు ప్రయోగించాల్సిన పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. నిన్న మధ్యాహ్నం 2:38 నిమిషాలకు శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ లో దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. కాగా ఈ ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా ఇస్రో ప్రకటించింది. ప్రతికూల వాతావరణం కారణంగా రాకెట్ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా తెలిపింది. ఈ తరహా ప్రాజెక్టును ఇస్రో తొలిసారిగి ప్రయోగించనుంది. తాత్కాలికంగా ఈ రాకెట్ లాంచ్ కి బ్రేక్ పడటంతో గురువారం సాయంత్రం 4:12 నిమిషాలకు తిరిగి ప్రయోగించనున్నట్టు ఇస్రో తెలిపింది.


ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్ ను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్ ద్వారా రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపించనున్నారు. వీటిని ఒకే కక్ష్యలో ఏర్పాటు చేశారు. ఇది భూమి నుంచి 60వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.


ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. దీనిపై నిఘా పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూ కక్ష్యలో విహరిస్తుంటాయి. భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని సృష్టించడం వంటి ప్రయోగాలకు ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి.

Railways Subsidy: ప్రతి ప్రయాణీకుడి టిక్కెట్‌పై 46 శాతం సబ్సిడీ.. రైల్వే మంత్రి కీలక ప్రకటన


Updated Date - Dec 04 , 2024 | 04:02 PM