ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jharkhand Floor Test: విశ్వాస తీర్మానం గెలుపు.. 47 మంది ఎమ్మెల్యేలు అనుకూలం, 29 ప్రతికూలం

ABN, Publish Date - Feb 05 , 2024 | 02:22 PM

జార్ఖాండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ రాష్ట్ర అసెంబ్లీలో శనివారంనాడు ప్రవేశపెట్టిన 'విశ్వాస తీర్మానం' గెలిచింది. సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 47, వ్యతిరేకంగా 29 ఓట్లు పడ్డాయి. దీంతో జార్ఖాండ్ సర్కార్‌ మనుగడకు అడ్డంకులు తొలగిపోయాయి.

రాంచీ: జార్ఖాండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ రాష్ట్ర అసెంబ్లీలో శనివారంనాడు ప్రవేశపెట్టిన 'విశ్వాస తీర్మానం' (Trust vote) గెలిచింది. సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 47, వ్యతిరేకంగా 29 ఓట్లు పడ్డాయి. దీంతో జార్ఖాండ్ సర్కార్‌ మనుగడకు అడ్డంకులు తొలగిపోయాయి.


దీనికి ముందు ముఖ్యమంత్రి చంపయి సోరెన్ (Champai Soren) రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాసతీర్మానాన్ని (Trust Motion) ప్రవేశపెట్టారు. భూకుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసిన మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వ విశ్వాస పరీక్షకు హాజరయ్యారు. 81 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చను ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ, దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని అన్నారు.


''కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రబుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. 2019లో హేమంత్ సోరెన్‌కు ప్రజాతీర్పు లభించింది. అలాంటి ముఖ్యమంత్రిని భూకుంభకోణం కేసులో అరెస్టు చేశారు'' అని చంపయి సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖాండ్ చరిత్రలో గిరిజనులు ఎప్పుడు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూసినా ఆ నాయకత్వాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఉన్నారు. హేమంత్ సోరెన్ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగిందో ఈరోజు యావద్దేశ ప్రజలు చూశారని, మీరు ఏ గ్రామానికి వెళ్లి చూసినా ప్రతి ఇంట్లోనూ హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టిన పథకాలు కనిపిస్తాయని సీఎం చెప్పారు.


సోరెన్ జిందాబాద్ నినాదాలు

దీనికి ముందు, అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ సీపీ రాథాకృష్ణన్ ప్రసంగిస్తుండగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ''హేమంత్ సోరెన్ జిందాబాద్'' అంటూ నినాదాలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై గవర్నర్ సభ వెలుపల మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగాన్ని అధికార పార్టీనే సిద్ధం చేసిందని, ఇప్పుడు వారే నినాదాలు చేస్తున్నారని ఆక్షేపించారు. కాగా, తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, విశ్వాస పరీక్షలో గెలిచి తీరుతామని జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య మీడియాకు తెలిపారు.

Updated Date - Feb 05 , 2024 | 02:28 PM

Advertising
Advertising