Hemant Soren: ఈడీ అధికారులపై పోలీసు కేసు పెట్టిన సీఎం
ABN, Publish Date - Jan 31 , 2024 | 05:19 PM
ఝార్ఖాండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారంనాడు ఒకవైపు విచారణ చేస్తుండగా, మరోవైపు ఈడీ ఆధికారులపై సీఎం పోలీసు కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాంచీలోని ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.
రాంచీ: ఝార్ఖాండ్ (Jharkhand) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు బుధవారంనాడు ఒకవైపు విచారణ చేస్తుండగా, మరోవైపు ఈడీ ఆధికారులపై సీఎం పోలీసు కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాంచీలోని ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.
భూ కుంభకోణం కేసులో గత పది రోజుల్లో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఈనెల 20న హేమంత్ సోరెన్‌ను 7 గంటలకు పైగా అధికారులు ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా మరోసారి విచారణ జరిపేందుకు భారీ భద్రత మధ్య రాంచీలోని సోరెన్ అధికార నివాసానికి ఈడీ అధికారులు బుధవారం చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎంను అరెస్టు చేసే అవకాశాలున్నాయని, ఆమె సతీమణి కల్పానా సోరెన్‌కు హేమంత్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్, సీఎం నివాసం, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలోనే జేఎంఎం ఎమ్మెల్యేలు సీఎం నివాసం వద్ద బలప్రదర్శనకు దిగారు. కేంద్రం ఆదేశాల మేరకే తమ సీఎంను ఈడీ వేధిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక దిగ్బంధాలకు దిగుతామని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jan 31 , 2024 | 05:22 PM