ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Allahabad High Court:నచ్చిన పద్ధతిలో పెళ్లి చేసుకోవచ్చు

ABN, Publish Date - Jun 11 , 2024 | 03:14 AM

నచ్చిన పద్ధతిలో వివాహం చేసుకునే హక్కు మేజర్‌కు ఉందని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఇష్టమైన వారితో కలిసి ఉండే హక్కు కూడా ఉందని, ఇందుకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని తెలిపింది.

  • అలహాబాద్‌ హైకోర్టు తీర్పు

ప్రయాగ్‌రాజ్‌, జూన్‌ 10: నచ్చిన పద్ధతిలో వివాహం చేసుకునే హక్కు మేజర్‌కు ఉందని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఇష్టమైన వారితో కలిసి ఉండే హక్కు కూడా ఉందని, ఇందుకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఓ వివాహం విషయమై మేజిస్ట్రేటు కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ జస్టిస్‌ జె.జె.మునీర్‌, జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ దేశ్వాల్‌ల ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 21 ఏళ్ల మహిళ ఏప్రిల్‌ నెలలో ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి చెల్లదని యువతి తల్లిదండ్రులు కేసు వేశారు. మేజిస్ట్రేటు కోర్టు కూడా అందుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ యువతి హైకోర్టులో అప్పీలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం కింది కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టింది.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 03:14 AM

Advertising
Advertising