ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాంబు పేలుళ్ల కేసులో కరీం తుండా నిర్దోషి

ABN, Publish Date - Mar 01 , 2024 | 02:56 AM

వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్‌ కరీం తుండా (81) నిర్దోషి అని గురువారం అజ్మీర్‌లోని టాడా కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాదయిన సందర్భాన్ని పురస్కరించుకొని 1993 డిసెంబరు 5, 6 తేదీల

జైపూర్‌, ఫిబ్రవరి 29: వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్‌ కరీం తుండా (81) నిర్దోషి అని గురువారం అజ్మీర్‌లోని టాడా కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాదయిన సందర్భాన్ని పురస్కరించుకొని 1993 డిసెంబరు 5, 6 తేదీల అర్ధరాత్రి అయిదు చోట్ల వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌, లఖ్‌నవూ, కాన్పూర్‌, సూరత్‌, ముంబయిల్లోని అయిదు రైళ్లలో ఆ బాంబులు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు తుండాతో పాటు ఇర్ఫాన్‌ అలియాస్‌ పప్పు, హమీదుద్దీన్‌లపై కేసులు పెట్టారు. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి రుజువులు చూపట్టలేకపోవడంతో ఆయనను విడుదల చేస్తున్నట్టు జడ్జి తెలిపారు. మిగిలిన ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

Updated Date - Mar 01 , 2024 | 02:56 AM

Advertising
Advertising