ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karnataka-Telangana: కర్ణాటక-తెలంగాణ మధ్య కృష్ణా నది వంతెన మూసివేత వాయిదా

ABN, Publish Date - Jan 12 , 2024 | 01:30 PM

కర్ణాటక-తెలంగాణ(Karnataka-Telangana) రాష్ట్రాల సరిహద్దులో కృష్ణానది(Krishna River)పై ఉన్న రోడ్డు వంతెనపై రాకపోకల నిలిపివేత ఈ నెల 17వ తేదీకి వాయిదా పడిందని రాయచూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివరాజ్‌ పాటీల్‌(Raichur City MLA Dr Shivraj Patil) తెలిపారు.

రాయచూరు(బెంగళూరు): కర్ణాటక-తెలంగాణ(Karnataka-Telangana) రాష్ట్రాల సరిహద్దులో కృష్ణానది(Krishna River)పై ఉన్న రోడ్డు వంతెనపై రాకపోకల నిలిపివేత ఈ నెల 17వ తేదీకి వాయిదా పడిందని రాయచూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివరాజ్‌ పాటీల్‌(Raichur City MLA Dr Shivraj Patil) తెలిపారు. గురువారం నగరంలోని విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఎమ్మెల్యే, సంక్రాంతి పండుగతో పాటు ఈ సందర్భంగా యాదగిరి జిల్లాలో జరిగే మైలారలింగ జాతరను పురస్కరించుకుని వంతెన మూసివేతను వాయిదా వేయాల్సిందిగా జిల్లాధికారిని కోరామన్నారు. ఈ క్రమంలో జిల్లాధికారి కృష్ణానదిపై ఉన్న వంతెన మీద నుంచి రాకపోకలను ఈ నెల 17వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపారన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పుణ్యనది స్నానాలు ఆచరించేవారు కృష్ణనదికి పెద్దసంఖ్యలో వెళతారని యాదగిరి జిల్లా గురుమిఠకల్‌ సమీపంలో ఉండే మైలార్‌లింగ జాతరకు సహితం స్థానికంగానే కాకుండా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వంతెన పై రాకపోకలు సంక్రాంతి ముగిసే వరకు కొనసాగించాలని తాము కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 01:30 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising