ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్విస్‌ను మరిపించేలా కశ్మీరు!

ABN, Publish Date - Feb 21 , 2024 | 03:31 AM

జమ్మూకశ్మీరు సమగ్రాభివృద్ధికి 370 అధికరణ రద్దు కీలకంగా మారిందని ప్రధా ని నరేంద్ర మోదీ అన్నారు. స్విట్జర్లాండ్‌ను మరిపించేలా కశ్మీరును పర్యాటక కేంద్రంగా మలుస్తామని ప్రకటించారు.

గొప్ప పర్యాటక ప్రాంతంగా మలుస్తాం

కుటుంబ పాలన నుంచి విముక్తి

రాష్ట్ర ప్రజలతో నేరుగా మమేకం: మోదీ

రూ.32 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

విద్యతోనే ఆర్థికంగా దేశం అగ్రగామి

ఐఐటీ-హెచ్‌ క్యాంపస్‌ అభివృద్ధి ప్రాజెక్టు

దేశానికి అంకితం చేసిన ప్రధాని

తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎం సహా

3 ఐఐటీలు, 3 ఐఐఎంలు కూడా

13,375 కోట్ల పనులకు శంకుస్థాపన

స్విస్‌ను మరిపించేలా కశ్మీరు!

370 అధికరణ రద్దుతోనే సాధ్యపడుతోంది: మోదీ

వివిధ రైల్వే పథకాలు జాతికి అంకితం

మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా హర్షం

జమ్ము, ఫిబ్రవరి 20: జమ్మూకశ్మీరు సమగ్రాభివృద్ధికి 370 అధికరణ రద్దు కీలకంగా మారిందని ప్రధా ని నరేంద్ర మోదీ అన్నారు. స్విట్జర్లాండ్‌ను మరిపించేలా కశ్మీరును పర్యాటక కేంద్రంగా మలుస్తామని ప్రకటించారు. పర్యాటకులు స్విస్‌ను సందర్శించడమే మరిచేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మౌలానా ఆజాద్‌ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో.. జమ్మూకశ్మీరులో రూ.32 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు/శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీవర్షం నడుమే ప్రసంగించారు. ఇక్కడ జి-20 సదస్సు నిర్వహించడం వల్ల కశ్మీరు అందాలు, సంస్కృతి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని.. అరబ్‌ దేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో నవశకం మొదలైందన్నారు. జమ్మూకశ్మీరు కుటుంబ పాలన నుంచి విముక్తి పొందిందని, కేంద్రం నేరుగా కశ్మీరీలతో మమేకం అవుతోందని తెలిపారు. ఒకప్పుడు హింస, వేర్పాటువాదం, తుపాకులు, బాంబుల మోతతో విలవిలలాడిన జమ్మూకశ్మీరు.. తన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఇప్పుడు సరికొత్తగా సామరస్యం, ప్రగతి దిశగా కదులుతోందని చెప్పారు. ప్రగతిశీలక జమ్మూకశ్మీరును అందిస్తామని ప్రమాణం చేశామని.. దానిని చేసి చూపుతామని.. వచ్చే కొన్నేళ్లలో యువత కలలు నెరవేరుస్తామని తెలిపారు. జమ్మూకశ్మీరు రాష్ట్రంగా ఉన్నప్పుడు 370 అధికరణ దాని అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. ఆ గోడను తన ప్రభుత్వం బద్దలు కొట్టిందని చెప్పారు. ఈ అధికరణ రద్దుకు గుర్తుగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని 370 సీట్లలో గెలిపించాలని కోరారు. 370 అధికరణపై బాలీవుడ్‌లో ఓ సినిమా నిర్మితమవుతోందని కూడా ప్రస్తావించారు. ఈ సినిమా గురించి సోమవారమే తనకు తెలిసిందని.. అదెలా ఉంటుందో తనకు తెలియదని.. అయితే వాస్తవ సమాచారాన్ని ప్రేక్షకులకు అందజేస్తుందని భావిస్తున్నానని తెలిపారు.

కోటి లక్షాధికారిణులు..

జమ్ము సభకు ముందు ప్రధాని కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు. ప్రధానంగా కతువా జిల్లా బసోలీకి చెందిన స్వయం సహాయ సంఘం (ఎస్‌హెచ్‌జీ) అధిపతి కీర్తితో మాట్లాడారు. రుణసాయం పథకంతో గ్రామీణ మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయో ఆమెతో చెప్పించారు. ఆమె ఆధ్వర్యంలోని సంఘం మూడు ఆవులు కొని.. రుణం చెల్లించింది. ఇతర మహిళల సాయంతో ఇప్పుడు పెద్ద గోశాలను నిర్మించారు. ఈ మార్పు ఘనత ప్రధానిదేనని చెప్పారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదా రులు కూడా మాట్లాడారు. దీన్‌దయాళ్‌ అంత్యోదయ స్కీం లబ్ధిదారైన షహీన్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ కూడా. ఇప్పుడామె ఔత్సాహిక పారిశ్రామికవేత్త. పౌలీ్ట్ర ఫాం సహా వివిధ యూనిట్ల ఏర్పాటుతో కశ్మీరు గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా పరివర్తన చెందుతున్నాయో ఆమె వివరించారు.

మోదీకి యామీ గౌతమ్‌ ధన్యవాదాలు

370 అధికరణపై సినిమా గురించి ప్రస్తావించినందుకు ప్రధాని మోదీకి నటి యామీ గౌతమ్‌ ‘ఎక్స్‌’లో ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన అంచనాలకు మించి తాము నటిస్తామన్న ఆశాభావం వ్యక్తంచేశారు. మోదీ ప్రసంగ వీడియోను కూడా షేర్‌ చేశా రు. ఈ నెల 23న ఆ సినిమా విడుదల కానుంది.

Updated Date - Feb 21 , 2024 | 03:31 AM

Advertising
Advertising