ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lal Bahadur Shastri: చెప్పుల్లేకుండా.. ఎండలో మైళ్ల దూరం నడుస్తూ బడికి.. స్ఫూర్తిమంతమైన శాస్త్రి లైఫ్ జర్నీ

ABN, Publish Date - Jan 11 , 2024 | 11:35 AM

దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడానికి గూగుల్ లో చాలా మంది వెతుకుతున్నారు. ఆయన జీవన నేపథ్యం ఏంటి, కటిక పేదరికం నుంచి ప్రధాని స్థాయికి వెళ్లిన ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తి ఉంటుంది. గురువారం శాస్త్రి 58 వ వర్ధంతి.

ఢిల్లీ: దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడానికి గూగుల్ లో చాలా మంది వెతుకుతున్నారు. ఆయన జీవన నేపథ్యం ఏంటి, కటిక పేదరికం నుంచి ప్రధాని స్థాయికి వెళ్లిన ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తి ఉంటుంది. గురువారం శాస్త్రి 58 వ వర్ధంతి. ఆయన నినదించిన "జై జవాన్ జై కిసాన్"(Jai Jawan Jai Kisan) నినాదం నేటికి అనేక మంది హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.

శాస్త్రీ అంటే నాయకత్వం ఒకటే కాదు.. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. మంచి స్వభావంతో లక్షల మంది ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యారు శాస్త్రి. 1964లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. భారత తొలి ప్రభుత్వంలో ఆయన అంతకుముందే హోం, రైల్వే శాఖలకు మంత్రిగా పని చేశారు. కేవలం రెండు సంవత్సరాల మంత్రి పదవితో ఆయన దేశంలో బలమైన మార్పులు తేగలిగారు.

బాల్యం..

లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2, 1904న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి ఏడు మైళ్ల దూరంలో ఉన్న మొఘల్‌సరాయ్ అనే చిన్న రైల్వే పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. శాస్త్రి ఏడాదిన్నర వయస్సు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. తరువాత హైస్కూల్‌ చదువుల కోసం మామతో కలిసి వారణాసి వెళ్లారు. ఆయనే ఇంట్లో అందరికన్నా చిన్నవాడు. హైస్కూలుకి వెళ్లడానికి ఆయనకు చెప్పులు లేకపోవడంతో మైళ్ల దూరం ఎండలో నడిచి వెళ్లి విద్యాభ్యాసం పూర్తి చేశారు.

మహాత్మా గాంధీ శిష్యుడు

శాస్త్రి యవ్వనుడిగా మారాక భారత స్వాతంత్ర్య ఆకాంక్ష, బ్రిటిషర్ల అరాచకం ఆయన్ని ఉద్యమం వైపు నడిచేలా చేసింది. బాపూజీ మహత్మాగాంధీ పోరాటంతో శాస్త్రి స్ఫూర్తి పొందారు. 16 ఏళ్ల వయస్సులో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. 1927 లో మీర్జాపూర్‌కి చెందిన లలితాదేవితో ఆయన వివాహం జరిగింది. అనంతరం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొని, ఏళ్లపాటు జైలులో గడిపారు. ఈ పోరాటం ఆయనలో నాయకత్వ లక్షణాలను పెంపొందించింది.

రాజకీయ జీవితం (1947-1964)

కాంగ్రెస్ పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి పదవులను చేపట్టారు. 1952, 1957, 1962లలో కాంగ్రెస్ విజయాలు సాధించేందుకు అంకితభావంతో పని చేశారు.


రెండేళ్లపాటు ప్రధానిగా.. (1964-66)

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మే 27, 1964న మరణించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి పదవి చేపట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి పదవీకాలం 1965 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధానికి సాక్ష్యంగా నిలిచింది. ఆయన 'జై జవాన్, జై కిసాన్' నినాదం 1965 యుద్ధ సమయంలో సైనికులు, రైతుల మనోధైర్యాన్ని పెంచింది. భారతదేశ ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, శాస్త్రి అదే ఏడాది హరిత విప్లవాన్ని కూడా ప్రచారం చేశారు.

ప్రధానిగా ఆయన 19 నెలలుపాటు పని చేశారు. జనవరి 11, 1966న తాష్కెంట్‌లో మరణించాడు. దేశంపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో శాస్త్రి ఒకరిగా నిలిచారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 11 , 2024 | 12:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising