ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP Lok Sabha first list: బీజేపీ తొలి జాబితా విడుదల..మోదీతో సహా 34 మంది కేంద్ర మంత్రులు

ABN, Publish Date - Mar 02 , 2024 | 06:49 PM

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులు మొదటి లిస్ట్‌లో చోటుచేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. అమిత్‌షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి, సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సుర స్వరాజ్ న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha polls) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా (First list)ను బీజేపీ (BJP) అధిష్ఠానం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులు మొదటి లిస్ట్‌లో చోటుచేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. అమిత్‌షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి, సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సుర స్వరాజ్ న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. 34 మంది కేంద్ర మంత్రులు ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ నేతలు ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే విడుదల చేశారు. 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 195 స్థానాలకు అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో ఖరారు చేసినట్టు తావడే తెలిపారు.


బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో 28 మంది మహిళలు, 47 మంది యువకులు, 18 గిరిజన తెగల అభ్యర్థులు ఉన్నారు. పశ్చిమబెంగాల్ నుంచి 26 మంది అభ్యర్థులను ప్రకటించగా, మధ్యప్రదేశ్ నుంచి 24 స్థానాలు, గుజరాత్ నుంచి 15 స్థానాలు, రాజస్థాన్-15, కేరళ-12, తెలంగాణ-9 మంది, ఢిల్లీ-5, జమ్మూ-2, ఉత్తరాఖండ్-2, గోవా-1, త్రిపుర-1, అండమాన్ 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎన్డీయేకు 400 సీట్ల లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందని, బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని ఈ సందర్భంగా తావడే, అర్జున్ పాండే ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చెప్పారు.

Updated Date - Mar 02 , 2024 | 06:50 PM

Advertising
Advertising