ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bihar Mahaghthbandhan: మహాకూటమికి నూకలు చెల్లు... జితిన్ రామ్ సంచలన జోస్యం

ABN, Publish Date - Jan 26 , 2024 | 02:43 PM

బీహార్‌లోని అధికార మహాకూటమి మనుగడ చర్చనీయాంశమవుతున్న తరుణంలో ఇంకెంతోకాలం కూటమి మనుగడ సాగించదని కూటమి మాజీ భాగస్వామి, హిందూస్థానీ అవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీ జోస్యం చెప్పారు.

పాట్నా: బీహార్‌లోని అధికార మహాకూటమి (Mahaghthbandhan) మనుగడ చర్చనీయాంశమవుతున్న తరుణంలో ఇంకెంతోకాలం కూటమి మనుగడ సాగించదని కూటమి మాజీ భాగస్వామి, హిందూస్థానీ అవామ్ మోర్చా (HAM) చీఫ్ జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ చేస్తున్న ప్రకటనలు చూసే రాష్ట్రంలో మార్పులు తథ్యమని తాము చెప్పినట్టు తెలిపారు.


''నితీష్ ప్రకటనల ఆధారంగానే జనవరి 20 తర్వాత బీహార్‌లో మార్పులు చేసుకుంటాయని ఇటీవల నేను చెప్పాను. ఆర్జేడీపై ఆయన (నితీష్) పలు వ్యాఖ్యలు చేశారు. వాటి ప్రకారమే మహాఘట్ బంధన్ ఎంతోకాలం ఉండదని చెప్పాం. సీఎం పదవిని వదలుకోవడానికి నితీష్‌ ఇష్టపడరు. ప్రధాని కావాలనుకున్న ఆయన ఆశలు చెల్లాచెదురయ్యాయి. ఆయన కూటమితో తెగతెంపులు చేసుకున్న తర్వాత లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లవచ్చు, లేదంటే ఇతర కూటములతో పొత్తు పెట్టుకోవచ్చు'' అని జితన్ రామ్ మాంఠీ చెప్పారు. జితిన్ మళ్లీ పార్టీ మారితే అత్యున్నత పదవి (పీఎం) విషయంలో ఆయన రాజీపడకపోవచ్చని అన్నారు.


ఇప్పటికిప్పుడు ఏమి జరగనుందనేది తాము చెప్పలేమని, కానీ సహజంగా ముఖ్యమంత్రి పదవి విషయంలో నితీష్ ఎప్పుడూ రాజీపడరని మాంఝీ తెలిపారు. సీఎంగా నితీష్ కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అంగీకరిస్తుందా, లేదా అనేది తాము చెప్పలేమన్నారు. బీహార్‌లో ప్రస్తుత పరిస్థితిపై మాంఝీ వైఖరి ఏమిటని ప్రశ్నించినప్పుడు తాము ఎన్డీయే కూటమితో ఉన్నామని, ప్రధాని మోదీ ఆదేశాలను పాటిస్తామని సమాధానమిచ్చారు.

Updated Date - Jan 26 , 2024 | 02:47 PM

Advertising
Advertising