ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maldives Row: మోదీపై నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రులపై సర్కార్ వేటు..

ABN, Publish Date - Jan 07 , 2024 | 06:49 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మాల్దీవుల మంత్రులపై ఆదేశ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. వారిపై తక్షణ చర్యలు తీసుకుంది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో మరియం షియున, మాల్షా, హసన్ జిహాన్‌ ఉన్నారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narndra Modi)పై అనుచిత వ్యాఖ్యలు (Drogatory comments) చేసిన ముగ్గురు మాల్దీవుల (Maldives) మంత్రులపై ఆదేశ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. వారిపై తక్షణ చర్యలు తీసుకుంది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో మరియం షియున, మాల్షా, హసన్ జిహాన్‌ ఉన్నారు. భారత ప్రధాని ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో పర్యటించి సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని అన్నారు. దీనిపై మాల్దీవుల మంత్రులు తమ అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోటీ పడలేరని, లక్షద్వీప్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని ట్వీట్లు చేశారు. తమ దేశం అందించే సర్వీసులను లక్షద్వీప్‌లో అందించలేరని, గదుల్లో దుర్వాసనే అతిపెద్ద సమస్య అని అక్కసు వెళ్లగక్కారు. మోదీని 'క్లోన్', 'తోలుబొమ్మ' అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై భారతీయులు, పలువురు సెలబ్రెటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మాల్దీవుల ట్రిప్‌ను రద్దు చేసుకున్నారు. పర్యాటకంగా మాల్దీవుల్ని బహిష్కరించాలని కామెంట్లు చేశారు.


తక్షణ దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవులు

భారతదేశాన్ని, ప్రధానమంత్రి మోదీని అవమానించేలా మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల సర్కార్ తక్షణ చర్యలకు దిగింది. మంత్రుల వ్యాఖ్యలతో మాల్దీవుల సర్కార్‌కు ఎలాంటి సంబంధం లేదని, వారి వ్యాఖ్యాలు ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించవని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా విదేశీ నేతలు, వ్యక్తులను కించపరచేలా కొందరు చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని, అవి ప్రభుత్వ అభిప్రాయాలు కావని తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా ఉండాలని, విద్యేషాన్ని వ్యాప్తి చేశాలా, మాల్దీవులకు, ఆ దేశ అంతర్జాతీయ భాగస్వాములకు మధ్య ఉన్న సన్నిహత సంబంధాలను దెబ్బతీసేలా ఉండకూడదని తమ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని ఒక ట్వీట్‌లో వివరణ ఇచ్చింది. తాజాగా ముగ్గురు మంత్రులపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా మంత్రుల తప్పిదాలన్ని సరిచేసుకునే ప్రయత్నం చేసింది.

Updated Date - Jan 07 , 2024 | 07:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising