West Bengal: మమతా బెనర్జీకి రోడ్డు ప్రమాదం.. కోల్‌కతా ఆసుపత్రికి తరలింపు
ABN, Publish Date - Jan 24 , 2024 | 04:10 PM
టీఎంసీ(TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న కారులోనే స్వల్పంగా గాయపడ్డారని అధికారిక వర్గాలు చెప్పాయి.
కోల్‌కతా: టీఎంసీ(TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న కారులోనే స్వల్పంగా గాయపడ్డారని అధికారిక వర్గాలు చెప్పాయి.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర చలిగాలులతో పశ్చిమ బెంగాల్ మొత్తం పొగమంచు అల్లుకుంది. ఈ క్రమంలో దీదీ.. బర్దమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక మమత డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో కారులో వెనక సీట్లో కూర్చున మమత స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన భద్రతా సిబ్బంది ఆమెను వెంటనే కోల్‌కతాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమె తలకు గాయమైనట్లు తెలుస్తోంది. అయితే భయపడాల్సిన పని లేదని.. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Jan 24 , 2024 | 04:11 PM