ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UP: భార్య వేధిస్తోందంటూ ఎస్పీ ఇంటి ఎదుట విషం తాగిన భర్త.. తరువాత..

ABN, First Publish Date - 2024-02-11T09:24:36+05:30

భార్య వేధిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త ఎస్పీ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంగర్హి ప్రాంతానికి చెందిన ప్రదీప్, ఇషా రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.

పిలిభిత్: భార్య వేధిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త ఎస్పీ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంగర్హి ప్రాంతానికి చెందిన ప్రదీప్, ఇషా రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి భార్య రూ.5 లక్షలు ఇవ్వాలని భర్తను వేధింపులకు గురి చేస్తూ వస్తోంది. ఆమె వేధింపులు తట్టుకోలేక భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆయన కంప్లెంట్‌ను వారు తీసుకోలేదు. భార్య తిరిగి అతనిపై కేసు పెట్టింది. దీంతో తీవ్ర మనోవేదనకు లోనయిన అతను ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు.

అక్కడ ఎస్పీ అందుబాటులోకి లేకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లాడు. ఎస్పీ ఇంటి ఎదుట తన వెంట తీసుకువచ్చిన విషాన్ని తాగాడు. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై ఎస్పీ అతుల్ శర్మ మాట్లాడుతూ.. బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2024-02-11T09:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising