Manipur: అక్కడ అంబులెన్స్ సైరెన్ వేరే.. ఎందుకంటే..?
ABN, Publish Date - Jan 04 , 2024 | 06:00 PM
మణిపూర్‌లో ఇకపై అంబులెన్స్‌లకు (Ambulance) వాడే సైరెన్ డిఫరెంట్‌గా ఉండాలని వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం స్పష్టంచేసింది. అంబులెన్స్‌లకు (Ambulance) ఇచ్చే సైరన్ మరే వాహనాలను ఉండకూడదని తేల్చిచెప్పింది.
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) గత ఏడాది రెండు తెగల మధ్య గొడవలతో అల్లాడిపోయింది. ఆ గొడవ సద్దుమణిగిన తర్వాత కొత్త సమస్య వచ్చి పడింది. రాష్ట్రంలో అంబులెన్స్, పోలీసులు వాడే సైరెన్ సేమ్ ఉండటమే కారణం. వాస్తవానికి అన్నీ చోట్ల అలానే ఉంటాయి. మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం తర్వాత అంబులెన్స్, పోలీసు సైరెన్ సేమ్ ఉండటంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. సైరెన్ రావడంతో.. ఆ వాహనంలో ఎమర్జెన్సీగా రోగులను తరలిస్తున్నారా..? లేదంటే పోలీసులు వస్తున్నారా..? ఇతరులు బయల్దేరారా అనే అంశాలపై క్లారిటీ లేదు. దీంతో మణిపూర్ (Manipur) ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
డిఫరెంట్‌గా అంబులెన్స్ సైరెన్
రాష్ట్రంలో ఇకపై అంబులెన్స్‌లకు (Ambulance) వాడే సైరెన్ డిఫరెంట్‌గా ఉండాలని వైద్యారోగ్యశాఖకు స్పష్టంచేసింది. అంబులెన్స్‌లకు (Ambulance) ఇచ్చే సైరన్ మరే వాహనాలను ఉండకూడదని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో మరింత పటిష్టంగా శాంతి భద్రతల నిర్వహణ కోసం ఇలాంటి డిసిషన్ తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంబులెన్స్ (Ambulance) మాదిరిగానే పోలీసుల వాహనం, ఇతరుల వాహనాలకు సైరెన్ ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. కొందరు భయాందోళనకు గురవుతున్నారని హోం శాఖ కమిషనర్ టి రంజన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సైరెన్‌ను పోలి కూడా ఉండొద్దు.. ?
ఇకపై అంబులెన్స్ (Ambulance) వాడే సైరెన్ మాదిరిగా ఎవరిది ఉండొద్దని.. దానిని పోలికలకు దగ్గరగా ఉన్న సైరెన్ కూడా వాడొద్దని తేల్చిచెప్పారు. దీంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. గత ఏడాది మణిపూర్‌లో (Manipur) మైతేయ్, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణల్లో వందలాది మంది చనిపోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతుంది. ఈ సమయంలో అంబులెన్స్ (Ambulance) సైరెన్ (Siren), పోలీసు (Police) వాహనాల సైరెన్ ఓకేలా ఉండటంతో జనం అయోమయానికి గురవుతున్నారు. అంబులెన్స్ వస్తే దారి ఇవ్వాలో..? లేదంటే పోలీసులు వస్తున్నారో తెలియడం లేదని.. అందుకే అంబులెన్స్‌లకు ఎవరూ వాడని కొత్త సైరెన్ కోసం చూస్తున్నారు.
Updated Date - Jan 04 , 2024 | 06:07 PM