Imphal:మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై మిలిటెంట్ల కాల్పులు
ABN, Publish Date - Jun 11 , 2024 | 02:47 AM
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ మెరుపు దాడిలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. సోమవారం ఉదయం జిరిబామ్ సమీపంలో జాతీయ రహదారి-37పై ఈ ఘటన చోటుచేసుకుంది. మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న జిరిబామ్‌ను సీఎం బీరేన్ మంగళవారం సందర్శించాల్సి ఉంది.
ఇంఫాల్, జూన్ 10: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ మెరుపు దాడిలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. సోమవారం ఉదయం జిరిబామ్ సమీపంలో జాతీయ రహదారి-37పై ఈ ఘటన చోటుచేసుకుంది. మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న జిరిబామ్‌ను సీఎం బీరేన్ మంగళవారం సందర్శించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు ఆ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఒకరోజు ముందుగానే కాన్వాయ్‌తో బయలుదేరగా దాడి జరిగింది. వెంటనే తేరుకున్న పోలీసు బలగాలు, అసోం రైఫిల్స్ దళాలు మిలిటెంట్లపై ఎదురు కాల్పులు జరిపాయి. ఇటీవల కనబడకుండా పోయిన మైతేయి రైతు శరత్ సింగ్(59) మృతదేహం 6న బయటపడటంతో జిరిబామ్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Updated Date - Jun 11 , 2024 | 02:47 AM