Mukesh Ambani: రామనామంతో మిరుమిట్లుగొల్పుతున్న ముఖేష్ అంబానీ ఇల్లు.. చూసేయండి
ABN, Publish Date - Jan 22 , 2024 | 01:15 PM
దేశమంతటా రామ నామ స్మరణ మార్మోగుతున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంటిని చూడ చక్కగా అలంకరించారు. ముంబయిలోని అంబానీ అధికారిక నివాసం యాంటిలియా ఆకర్షణీయమైన లైటింగ్‌తో చూపరులను కట్టిపడేస్తోంది.
ముంబయి: దేశమంతటా రామ నామ స్మరణ మార్మోగుతున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంటిని చూడ చక్కగా అలంకరించారు. ముంబయిలోని అంబానీ అధికారిక నివాసం యాంటిలియా ఆకర్షణీయమైన లైటింగ్‌తో చూపరులను కట్టిపడేస్తోంది. 27 అంతస్తుల భవనంపై "జై శ్రీ రామ్" అని రామనామాలను ప్రదర్శించారు.
అయోధ్య(Ayodhya) రామ మందిరాన్ని భవనంపై ప్రదర్శించారు. ఇంటి ప్రాంగణాన్ని సైతం రామచంద్రుడి బ్యానర్లు, లైట్లతో ఆకర్షణీయంగా అలంకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయోధ్యలో 12.30 గంటలకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సామాన్య జనం హాజరయ్యారు.
Updated Date - Jan 22 , 2024 | 01:17 PM