ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sukma: స్వాతంత్య్రం వచ్చాక అక్కడ తొలిసారి ఎగిరిన జాతీయ జెండా..

ABN, Publish Date - Feb 19 , 2024 | 03:43 PM

దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుటికీ మావోయిస్టులు చెరలో ఉన్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి జాతీయ జెండా ఎగురవేయడంతో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని(Chattisgarh) సుక్మాలోని పువర్తి గ్రామంలో ఒకప్పుడు ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు(Maoists) ప్రభుత్వాన్ని నడిపారు.

సుక్మా: దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుటికీ మావోయిస్టులు చెరలో ఉన్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి జాతీయ జెండా ఎగురవేయడంతో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని(Chattisgarh) సుక్మాలోని పువర్తి గ్రామంలో ఒకప్పుడు ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు(Maoists) ప్రభుత్వాన్ని నడిపారు. అక్కడ మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి భద్రతా బలగాలు పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ క్రమంలో భద్రతా బలగాలకు వ్యతిరేకంగా.. మావోయిస్టులు దాడులకు ప్లాన్ చేశారు. అయితే భద్రతా దళాల తనిఖీలో మావోయిస్టులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న తరువాత పోలీసులు.. గ్రామంలో జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేశారు. అలా.. సోమవారం జాతీయ జెండా ఎగురవేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛా వాయువు అందించారు. మావోయిస్టులు కూరగాయలు పండించే భూమిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్రాంతం మావోయిస్టుల శిక్షణా శిబిరంగా ఉండేది. అక్కడ వారు సమావేశాలు నిర్వహించి సమీపంలో నివసిస్తున్న యువకులను నియమించుకునేవారు. వారికి దాడులు ఎలా చేయాలో నేర్పేవారు. గ్రామంలో భద్రతా శిబిరాన్ని తెరవడం మావోయిస్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఒకప్పుడు పోలీసులు అడుగు పెట్టడానికి భయపడే ప్రాంతంలో, గత కొన్ని నెలల్లో అలాంటి ఏడు శిబిరాలు తెరిచారు. మావోయిస్టుల కదలిక సమాచారం అందగానే అక్కడి నుంచి భద్రతా బృందాన్ని హుటాహుటిన పంపవచ్చు. మావోయిస్టు కార్యకలాపాలకు గ్రామస్థులు దూరంగా ఉండాలని.. వారికి ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల టేకల్ గూడ పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేయడంతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దానికి ప్రతిగా పువర్తి గ్రామంలో పోలీసులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2024 | 03:43 PM

Advertising
Advertising