National : వడదెబ్బతో మార్చి నుంచి 60 మంది మృతి
ABN, Publish Date - May 25 , 2024 | 04:09 AM
యావత్ భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో ఉడికిపోతోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి సుమారు 16,344 వడదెబ్బ కేసులు నమోదు అయ్యాయి
న్యూఢిల్లీ/విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), మే 24: యావత్ భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో ఉడికిపోతోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి సుమారు 16,344 వడదెబ్బ కేసులు నమోదు అయ్యాయి. కనీసం 60 మంది మరణించారు. మే 22వ తేదీ ఒక్కరోజే 486 వడదెబ్బ కేసులు నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) లెక్కలు చెపుతున్నాయి. గురువారం ఐఎండీ ఓ వాతావరణ హెచ్చరిక జారీ చేస్తూ... మే 24 - 27 మధ్య ఉత్తర భారతంలో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లోని ఫలోడీ గ్రామంలో శుక్రవారం 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Updated Date - May 25 , 2024 | 04:11 AM