ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లక్షదీవుల్లో నౌకాదళం కొత్త స్థావరం

ABN, Publish Date - Mar 02 , 2024 | 02:25 AM

హిందూ మహాసముద్రంలో శత్రువుల సైనిక, వాణిజ్య పరమైన కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచటానికి వీలుగా భారత నౌకాదళం..

హిందూ మహాసముద్రంలో శత్రువుల కదలికపై నిఘా కోసం ఏర్పాటు

ఐఎన్‌ఎ్‌స విక్రమాదిత్య, ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌లపై జరిగే కమాండర్ల సదస్సులో స్థావరానికి పచ్చజెండా

న్యూఢిల్లీ, మార్చి 1: హిందూ మహాసముద్రంలో శత్రువుల సైనిక, వాణిజ్య పరమైన కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచటానికి వీలుగా భారత నౌకాదళం.. ఐఎన్‌ఎ్‌స జటాయు పేరుతో లక్షదీవుల్లో ఒక కొత్త స్థావరాన్ని వచ్చే వారం ప్రారంభించనుంది. తొలుత కొద్దిమంది అధికారులు, సిబ్బందితో మొదలుపెట్టి ఆ తర్వాత దీనిని పూర్తిస్థాయిలో విస్తరించనుంది. లక్షదీవుల్లోని మినికాయ్‌ ద్వీపంలో ఈ స్థావరం ఉంటుందని రక్షణశాఖకు చెందిన ఒక అధికారి తెలిపినట్లుగా ఏఎన్‌ఐ వార్తాసంస్థ శుక్రవారం వెల్లడించింది. మాల్దీవులకు దాదాపు 80 కి.మీ.ల దూరంలో ఉండే ఈ స్థావరంతో నిఘాపై మరింత పట్టు పెరుగుతుందని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉన్న ఐఎన్‌ఎ్‌స బాజ్‌లాగే ఇది పని చేస్తుందని తెలిపారు. యుద్ధవిమాన వాహక నౌకలు ఐఎన్‌ఎ్‌స విక్రమాదిత్య, ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌లపై వచ్చే వారం సంయుక్తంగా నిర్వహించే కమాండర్ల సదస్సులో ఈ కొత్త స్థావరాన్ని ప్రారంభించాలని నౌకాదళం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సు సందర్భంగా ఉన్నతస్థాయి విన్యాసాలు చేపట్టనున్నారు. మరోవైపు, నాలుగు కొత్త ఎంహెచ్‌-60 రోమియో హెలికాప్టర్లు నౌకాదళంలో తమ సేవలను వచ్చే వారం కొచి నుంచి మొదలుపెట్టనున్నాయి. బహుళ ప్రయోజనార్థకంగా ఉండే ఈ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేశారు. ఈ నెల 4వ తేదీన గోవాలో నౌకదళ యుద్ధ కళాశాలను కూడా ప్రారంభించనున్నారు.

Updated Date - Mar 02 , 2024 | 02:25 AM

Advertising
Advertising