ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Punjab: నిహాంగ్ సిక్కు ఘాతుకం..గురుద్వారాలో యువకుడి హత్య

ABN, Publish Date - Jan 16 , 2024 | 02:09 PM

పంజాబ్‌ లోని ఫగ్వారాలో ఒళ్లు గగుర్పొడిచే హత్యా ఘటన చోటుచేసుకుంది. శ్రీ చౌరా ఖూహ్ సాహిబ్ గురుద్వారా వద్ద ఒక యువకుడిని నిహాగ్ సిక్కు ఒకరు దారుణంగా హత్య చేశాడు. మతదూషణకు పాల్పడమే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు.

ఫగ్వారా: పంజాబ్‌ (Punjab)లోని ఫగ్వారా (Phagwara)లో ఒళ్లు గగుర్పొడిచే హత్యా ఘటన చోటుచేసుకుంది. శ్రీ చౌరా ఖూహ్ సాహిబ్ గురుద్వారా వద్ద ఒక యువకుడిని నిహాగ్ సిక్కు (Nihag Sikh) ఒకరు దారుణంగా హత్య చేశాడు. మతదూషణకు పాల్పడమే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఎస్‌పీ గుర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.


కాగా, గురుద్వారా వద్ద యువకుడి హత్యా ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు కపూర్తలా ఎస్ఎస్‌పీ వత్సల గుప్తా చెప్పారు. ఘటనకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాస్తవాలను నిర్ధారించే ప్రక్రియలో ఉన్నందున ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు వెల్లడించలేమన్నారు.


గత ఏడాది నిహాంగ్ సిక్కుల కాల్పుల్లో...

సాంపదాయబద్ధమైన తల్వార్‌లను ధరించే వారిని నిహాంగ్ సిక్కులని అంటారు. గత ఏడాది నవంబర్‌లో కపుర్తలా జిల్లాలో నిహాంగ్‌ సిక్కులు కొందరు కాల్పులు జరపడంతో ఒక పోలీసు కానిస్టేబుల్ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కపుర్తాలాలోని శ్రీ అకల్ బుంగ గురుద్వారా ఆక్రమణకు సంబంధించిన కేసులో కొందరు నిహాంగ్‌‌లను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినప్పుడు ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

Updated Date - Jan 16 , 2024 | 02:09 PM

Advertising
Advertising