ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Nitish Kumar: మంత్రులకు శాఖల కేటాయింపు, హోం శాఖ ఆయనవద్దే..

ABN, Publish Date - Feb 03 , 2024 | 02:49 PM

బీహార్‌కు తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ తన మంత్రివర్గానికి శనివారంనాడు శాఖలు కేటాయించారు. హోం శాఖను సీఎం తన వద్దనే ఉంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ్యం, క్రీడా శాఖలు అప్పగించారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు వ్యవసాయ శాఖ కేటాయించారు.

పాట్నా: బీహార్‌కు తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ (Nitish) తన మంత్రివర్గానికి శనివారంనాడు శాఖలు కేటాయించారు. హోం శాఖను సీఎం తన వద్దనే ఉంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ్యం, క్రీడా శాఖలు అప్పగించారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు వ్యవసాయ శాఖ కేటాయించారు.


విపక్ష 'ఇండియా' కూటమికి, బీహార్‌లోని మహాఘట్బంధన్‌కు ఉద్వాసన చెప్పిన నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయేలో చేరడం ద్వారా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 28న 8 మంది మంత్రులతో కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హెచ్ఏఎం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నితీష్ క్యాబినెట్‌లో చేరారు.

Updated Date - Feb 03 , 2024 | 02:51 PM

Advertising
Advertising