ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

INDIA Alliance: ఇండియా కూటమి కన్వీనర్‌ నితీశ్! నేతలేమన్నారంటే?

ABN, Publish Date - Jan 03 , 2024 | 01:12 PM

లోక్ సభ ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు వేగం పెంచారు. కూటమిలో కీలకమైన కన్వీనర్ పోస్ట్ ని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) కి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ నాయకత్వానికి ఇప్పటికే పలువురు నేతలు సమ్మతి తెలిపారు.

పట్నా: లోక్ సభ ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు వేగం పెంచారు. కూటమిలో కీలకమైన కన్వీనర్ పోస్ట్ ని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) కి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ నాయకత్వానికి ఇప్పటికే పలువురు నేతలు సమ్మతి తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీల వర్చువల్ సమావేశం ఈ వారంలో జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదే అంశంపై నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కాంగ్రెస్ చర్చించింది. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలను సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నితీష్ నాయకత్వానికి మద్దతు తెలిపారు. డిసెంబర్ 19న, ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో 4వ సమావేశం నిర్వహించాయి.

అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ సమావేశంలో కూటమిలో సీట్ల పంపకం, ఉమ్మడి ప్రచార బ్లూప్రింట్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు.

Updated Date - Jan 03 , 2024 | 01:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising