Nitish Kumar: గవర్నర్ తేనేటి విందుకు తేజస్వి గైర్హాజర్.. నితీష్ స్పందన ఏమిటో తెలుసా?
ABN, Publish Date - Jan 26 , 2024 | 08:38 PM
బీహార్ సీఎం నితీష్ కుమార్ 'మహాఘట్బంధన్'కు ఉద్వాసన చెప్పి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరనున్నారనే ఊహాగానాల మధ్య మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గైర్హాజరయ్యారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు నితీష్ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. ''ఎవరైతే రాలేదే వారినే అడగండి...'' అంటూ సూటి సమాధానం దాటవేశారు.
పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ 'మహాఘట్బంధన్' (Mahagathbandhan)కు ఉద్వాసన చెప్పి బీజేపీ(BJP) సారథ్యంలోని ఎన్డీయే (NDA)లో చేరనున్నారనే ఊహాగానాల మధ్య మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) గైర్హాజరయ్యారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు నితీష్ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. ''ఎవరైతే రాలేదే వారినే అడగండి...'' అంటూ సూటి సమాధానం దాటవేశారు.
నిప్పు రాజుకుందిలా...
జేడీయూ సారథ్యంలో కాంగ్రెస్, ఆర్జేడీ, మరో మూడు వామపక్షాల మద్దతుతో ఏర్పడిన మహాఘట్బంధన్‌పై నితీష్ కొద్దికాలంగా గుర్రుగా ఉన్నారు. ఆర్జేడీ వ్యవహార శైలిపై సంతృప్తిగా లేరు. ఈ క్రమంలోనే నితీష్ గురువారంనాడు ఆనవంశిక పాలనపై చేసిన వ్యాఖ్యలపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య వరుస ట్వీట్లలో ఘాటు విమర్శలు చేశారు. గాలి దిశ మార్చుకున్నట్టు ఆయన సిద్ధాంతాలు మార్చుకుంటారంటూ నితీష్ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆ ట్వీట్లను రోహిణి ఆచార్య తొలగించినప్పటికీ అప్పటికే అది దావానలమైంది. అటు జేడీయూ, ఇటు ఆర్జేడీ తమ అగ్రనాయకులతో గురువారంనాడు వేర్వేరుగా సమావేశాలు జరిపాయి. బీహార్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం ఢిల్లీలో బీహార్ బీజేపీ నేతలతో సమావేశం జరిపారు. ఈ క్రమంలోనే నితీష్‌కు బీజేపీ తలుపులు మూయలేదంటూ ఆ పార్టీ రాష్ట్ర నేతలు సంకేతాలిచ్చారు. దీంతో ఊహాగానాలు మరింత ముమ్మరమయ్యాయి. నితీష్ సీఎం పదవికి శనివారంనాడు రాజీనామా చేస్తారని, అనంతరం బీజేపీ మద్దతుతో తిరిగి సీఎంగా ఏడోసారి ప్రమాణస్వీకారం చేస్తారని, బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీలు ఆయన మంత్రివర్గంలో చేరుతారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
Updated Date - Jan 26 , 2024 | 08:38 PM