ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NutriAid App : ఆహారాన్ని ఫొటో తీస్తే కేలరీలు చెప్పేస్తుంది!

ABN, Publish Date - Feb 16 , 2024 | 05:27 AM

మనం తినే ఆహారంలో ఎన్ని కేలరీలున్నాయి? పోషకాలెన్ని? చక్కెర శాతం ఎంత? వంటి విషయాలను తెలుసుకోవాలంటే.. ఆ ఆహారాన్ని ఒక్కసారి క్లిక్‌మనిపిస్తే చాలు.. ‘న్యూట్రీ ఎయిడ్‌’ అనే యాప్‌ ద్వారా అన్నీ వెంటనే తెలిసిపోతాయి. వీటిని గుర్తించే

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మనం తినే ఆహారంలో ఎన్ని కేలరీలున్నాయి? పోషకాలెన్ని? చక్కెర శాతం ఎంత? వంటి విషయాలను తెలుసుకోవాలంటే.. ఆ ఆహారాన్ని ఒక్కసారి క్లిక్‌మనిపిస్తే చాలు.. ‘న్యూట్రీ ఎయిడ్‌’ అనే యాప్‌ ద్వారా అన్నీ వెంటనే తెలిసిపోతాయి. వీటిని గుర్తించే ఈ యాప్‌ను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరోగ్యవంతమైన, పోష క విలువలు నిండిన ఆహారాన్ని ఎంపిక చేసుకునేందుకు ఈ యాప్‌ తోడ్పడుతుంది. మన ఆహారపు అలవాట్లలో పెనుమార్పులకు నాంది పలికే ఈ యాప్‌ను ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.హేమలత, జర్మనీకి చెందిన ఆగ్‌సబర్గ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ మార్కస్‌ కెక్‌ గురువారం తార్నాకలోని ఎన్‌ఐఎన్‌ కా ర్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. జర్మనీ సహకారంతో రెండే ళ్లపాటు శ్రమించిన ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత ్తల బృందం.. ఏ ఆహారం తీసుకుంటే మంచిదో వివరించే ఇతర సాధారణ యాప్‌లకు భిన్నంగా వినూత్నమైన, సమగ్రమైన యాప్‌ను అభివృద్ధి చేసింది. మన ఆహారపు అలవాట్లలో మంచి చెడులను గుర్తించడంతోపాటు మంచి ఆహారపు అలవాట్లు పెంపొందించుకునేందుకు కూడా ఈ యాప్‌ శాస్త్రీయమైన సూచనలు చేస్తుంది. మనం తీసుకునే ఆహారాన్ని ఈ యాప్‌తో స్కాన్‌ చేస్తే.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ సహకారంతో ఆ ఆహారంలోని పోషక విలువలను ఇది క్షణాల్లో చెప్పేస్తుంది. ఇందుకోసం ఈ యాప్‌లో ప్రత్యేక టూల్‌ను పొందుపరిచారు.

మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి సూక్ష్మ, స్థూల పోషకాలు ఉన్నాయో, ఆ ఆహారం వల్ల ఎంత పరిమాణంలో కర్బన ఉద్గారాలు ఉత్పన్నమవుతున్నాయనే వివరాలను కూడా ఈ యాప్‌ అందిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన 720 మంది ఆహారపు అలవాట్ల ఆధారంగా మొదట పైలట్‌ ప్రాజెక్టుగా దీనిని చేపట్టారు. ఆ తరువాత రెండో దశలో ప్రజలందరి ఆహారపు అలవాట్లు, ఎలాంటి పోషకాహారం తీసుకోవాలనే వివరాలతో సమగ్ర యాప్‌ను అభివృద్ధి చే శారు. ఎన్‌ఐఎన్‌, జర్మనీకి చెందిన ఆగ్‌సబర్గ్‌ విశ్వవిద్యాలయంతోపాటు చండీగఢ్‌కు చెందిన స్టార్టప్‌ కాల్‌వ్రే వెల్‌నెస్‌ సొల్యూషన్స్‌ సంస్థలు ఈ యాప్‌ అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. మనం ఎలాంటి ఆహారం తింటున్నామో తెలుసుకుని, అందుకు అనుగుణంగా శారీరక శ్రమ చేస్తూ, ఆరోగ్యంగా ఉండటంతో పాటు పర్యావరణ హితమైన ఆహారాన్ని ఎంపిక చేసుకునేందుకు న్యూట్రీ ఎయిడ్‌ యాప్‌ తోడ్పడుతుందని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల వారీగా ఉన్న ఆహారపు అలవాట్ల ఆధారంగా వాటన్నింటి వివరాలను యాప్‌లో పొందుపరచడం సవాల్‌తో కూడుకున్నదని, అయినా ఈ యాప్‌లో సుమారు 5వేల వరకు పొందుపరిచామని చెప్పారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఎన్‌ఐఎన్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంజీ సుబ్బారావు, కాల్ర్వీ సీఈవో వినీత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 05:27 AM

Advertising
Advertising