ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heart Attack: కోచింగ్ క్లాస్‌లో విషాదం.. గుండెపోటుతో యువకుడి మృతి

ABN, Publish Date - Jan 18 , 2024 | 03:30 PM

దేశంలో గుండె పోటుతో(Heart Attacks) మరణిస్తున్న యువత సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో(Madyapradesh) ఓ యువకుడు కోచింగ్ క్లాస్‌లో ఉండగా.. స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి గుండెపోటు వచ్చిందని గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

ఇండోర్: దేశంలో గుండె పోటుతో(Heart Attacks) మరణిస్తున్న యువత సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో(Madyapradesh) ఓ యువకుడు కోచింగ్ క్లాస్‌లో ఉండగా.. స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి గుండెపోటు వచ్చిందని గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌(Indore) నగరం భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్(18) మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధం అవుతున్నాడు.

ఇందుకోసం నగరంలోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నాడు. క్లాసులు జరుగుతున్న క్రమంలో అతనికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. కొద్దిగా తూలినట్లు అనిపించినా.. తరువాత మళ్లీ క్లాసు వినడానికి ప్రయత్నించాడు.


ఎంతకూ నొప్పి తగ్గకపోవడంతో పది సెకన్ల పాటు ముందు ఉన్న డెస్క్‌పై వాలాడు. పక్కనే కూర్చున్న స్నేహితుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. కాసేపటికి మాధవ్ తన బెంచిపై నుంచి జారీ కింద పడిపోయాడు. గమనించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు అతన్ని హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవ్ మృతి చెందాడు.

బాధితుడు క్లాస్ రూంలో పడిన ఇబ్బంది తాలుకు విజువల్స్ అన్ని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గడిచిన కొన్ని వారాల్లో ఇండోర్‌లోనే నలుగురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. గతేడాది 55 ఏళ్ల వ్యాపారవేత్త వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందారు. హార్ట్ అటాక్ బాధితుల్లో ఎక్కువగా యువతే ఉంటుండటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 18 , 2024 | 03:31 PM

Advertising
Advertising