ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: నేను భిన్నమైన మనిషిని! : మోదీ

ABN, Publish Date - Mar 11 , 2024 | 08:29 AM

తాను విభిన్నమైన మనిషినని.. ప్రాజెక్టులను ప్రకటించడమే కాదు.. అమ లు చేసి చూపుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. శరవేగంతో విమానాశ్రయా లు, హైవేలు, రైలు మార్గాల నిర్మాణాలు, ప్రారంభోత్సవాలను వచ్చే ఎన్నికల కోసమన్న కోణంలో చూడొద్దని కోరారు.

  • ప్రాజెక్టులు ప్రకటించడమే కాదు

  • అమలు చేసి చూపుతున్నాం

లఖ్‌నవూ/రాయ్‌పూర్‌, మార్చి 10: తాను విభిన్నమైన మనిషినని.. ప్రాజెక్టులను ప్రకటించడమే కాదు.. అమ లు చేసి చూపుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. శరవేగంతో విమానాశ్రయా లు, హైవేలు, రైలు మార్గాల నిర్మాణాలు, ప్రారంభోత్సవాలను వచ్చే ఎన్నికల కోసమన్న కోణంలో చూడొద్దని కోరారు. 2047లోగా భారత్‌ను అగ్రరాజ్యం చేయాలన్న లక్ష్యం సాధించే క్రమంలో దీన్ని తన ప్రగతి ప్రయాణంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా రూ.42వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిలో ఒక్క యూపీ ప్రాజెక్టుల విలువే రూ.37,500కోట్లు. అలాగే వివిధ రాష్ట్రా ల్లో రూ.9,800కోట్లతో నిర్మించిన 12ఎయిర్‌పోర్టు టెర్మినళ్లను ఆయన ప్రారంభించారు. అలాగే ఆంధ్రలో కడప, కర్ణాటకలో హుబ్బళి, బెళగావి విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం తెచ్చిన ‘మహాత్రీ వందన యోజన’ను వర్చువల్‌గా ప్రారంభించారు.


అనంతరం ప్రసంగిస్తూ.. గతంలో ఎన్నికల ముందు ప్రాజెక్టులపై ప్రకటనలు మాత్రమే చేసేవారని.. తర్వా త అటకెక్కించేవారని మోదీ తెలిపారు. తాను చేస్తున్న అభివృద్ధితో బుజ్జగింపు రాజకీయాల విషం నిర్వీర్యమవుతోందన్నారు. కాగా దేశవ్యాప్తంగా 3కోట్ల మంది మహిళల ను లక్షాధికారిణులుగా మార్చే లక్ష్యంతో తన ప్రభుత్వం పనిచేస్తోందని మోదీ అన్నారు. ‘మహాత్రీ వందన్‌ యోజన’ కింద ఛత్తీస్‌గఢ్‌లో 70లక్షల మందికి పైగా మహిళలకు ప్రతి నెలా రూ.1,000 చొప్పున అందుతుందని చెప్పారు. ‘ఉజ్వల స్కీం కింద చౌక ధరకే వంట గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. 65శాతానికిపైగా ముద్రారుణాలు మహిళలే పొందారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 10 కోట్ల మందికిపైగా మహిళల జీవితాలను మా ప్రభుత్వం మార్చేసింది. మా కృషితో కోటి మందికిపైగా ‘లఖ్‌పతీ దీదీ’లుగా ఆవిర్భవించారు. 3కోట్ల మందిని లక్షాధికారిణులను చేయాలన్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం’ అన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 08:30 AM

Advertising
Advertising