ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rashmika Mandanna: అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ!

ABN, Publish Date - May 17 , 2024 | 01:27 PM

దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ``ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్``ను వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను ``అటల్ సేతు`` అని పిలుస్తున్నారు. ఈ అటుల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్న ప్రశంసలు కురిపించింది. ఆ వీడియోపై ప్రధాని స్పందించారు.

PM Modi responds to Rashmika Mandanna's post

దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ``ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్``ను (MTHL) వాణిజ్య రాజధాని ముంబైలో (Mumbai) నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను ``అటల్ సేతు`` (Atal Setu) అని పిలుస్తున్నారు. ఈ అటుల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్న (Rashmika Mandanna) ప్రశంసలు కురిపించింది. అటల్ సేతుపై కారులో ప్రయాణిస్తూ దాని గురించి తాను మాట్లాడుతున్న వీడియోను రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వైరల్ వీడియోను తాజాగా ప్రధాని మోదీ (PM Modi) వీక్షించారు.


``ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారిని అనుసంధానించడం కంటే మించి సంతృప్తి ఏముంటుంద``ని ప్రధాని ట్విటర్‌లో కామెంట్ చేశారు. భారత్.. ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరని, అసాధ్యం అనుకున్న దాన్ని ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం చేశారని రష్మిక ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వంతెనపై ప్రయాణం ఓ మధురానుభూతిని ఇస్తుందని, వికసిత్ భారత్‌కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోందని వ్యాఖ్యానించింది.


ముంబైలోని సేవ్రీ నుంచి రాయగఢ్‌లోని నహవా శేవాను కలుపుతూ మొత్తం ఆరు లేన్ల విస్తీర్ణంతో ఈ వంతెన నిర్మితమైంది. ఈ వంతెన మొత్తం పొడవు 21.8 కిలో మీటర్లు. అందులో 16 కి.మీ. ఆరేబియా సముద్రంపైనే ఉండడం ఈ వంతెన విశేషం. రూ.21 వేల కోట్ల ఖర్చుతో, ఏడుసంవత్సరాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించింది. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించడానికి రెండు గంటల సమయం పట్టేది. అటల్ సేతు వల్ల ప్రయాణ సమయం 20 నిమిషాలకు తగ్గింది.

ఇవి కూడా చదవండి..

Everest: ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలాలపై బ్యాన్‌ విధించిన నేపాల్‌.. కారణం ఏంటో తెలుసా?


PM Modi: ఈడీ సీజ్‌ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 17 , 2024 | 01:28 PM

Advertising
Advertising