ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MP: గిరిజన ప్రాంతాల్లో మోదీ పర్యటన.. రూ.7 వేల కోట్లకుపైగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు

ABN, Publish Date - Feb 11 , 2024 | 10:01 AM

మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో గిరిజన సంఘాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆదివారం ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో రూ. 7,550 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో గిరిజన సంఘాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆదివారం ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో రూ. 7,550 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. గోపాల్‌పురాలో జరిగే సభలో దేశ నలుమూలల నుంచి వచ్చే గిరిజనులు పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ మీడియా సెల్ చీఫ్ ఆశిష్ అగర్వాల్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది మోదీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ఆరు లోక్‌సభ స్థానాలను గిరిజనులకు కేటాయించారు.

ఆహార్ అనుదాన్ యోజన కింద దాదాపు రెండు లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ప్రధాని నెలవారీ వాయిదాలను కూడా పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద వెనుకబడిన తెగలకు చెందిన మహిళలకు పౌష్టికాహారం కోసం నెలకు రూ.1,500 అందిస్తారు. SVAMITVA పథకం కింద 1.75 లక్షల 'అధికార్ అభిలేఖ్' (భూమి హక్కుల రికార్డు)ని కూడా ప్రధాని పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ప్రజలకు వారి భూమిపై అన్ని అధికారాలు కల్పిస్తుంది.

అనంతరం గిరిజనుల కోసం తాంత్యా మామా భిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. మధ్యప్రదేశ్‌లో నీటి సరఫరా, తాగునీటి సదుపాయాన్ని బలోపేతం చేసే బహుళ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేస్తారు. ఇలా మధ్యప్రదేశ్ వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఆయన బిజిబిజీగా గడపనున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 11 , 2024 | 10:02 AM

Advertising
Advertising