ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: చైనా బెట్టింగ్ యాప్‌లపై కఠిన ఆంక్షలు.. రూ.123 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

ABN, Publish Date - Feb 29 , 2024 | 08:38 PM

చైనా బెట్టింగ్, లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కొరడా ఝుళిపించింది. కొచ్చి, ముంబయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీల్లో గురువారం ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించింది. చైనా యాప్‌లకు చెందిన రూ.123 కోట్ల డిపాజిట్లను స్తంభింపజేసింది.

ఢిల్లీ: చైనా బెట్టింగ్, లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కొరడా ఝుళిపించింది. కొచ్చి, ముంబయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీల్లో గురువారం ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించింది. చైనా యాప్‌లకు చెందిన రూ.123 కోట్ల డిపాజిట్లను స్తంభింపజేసింది. ఈనెల 23, 24న చెన్నైలో క్సోడ‌జ్ సొల్యూష‌న్, ముంబయిలోని ఎన్ఐయూఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌, విక్రా ట్రేడింగ్ ఎంట‌ర్‌ప్రైజెస్ స‌హా ప‌లు కంపెనీలు, కొచ్చిలోని ర‌ఫేల్ జేమ్స్ రొజారియా డైరెక్ట‌ర్ల నివాసాల‌పై దాడులు చేప‌ట్టినట్లు ఓ ప్రకటనలో వివరించింది.

నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ లోన్‌, బెట్టింగ్ యాప్స్ ద్వారా అక్ర‌మంగా సంపాదించిన సొమ్మును గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకునేందుకు సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ మోసాలపై హరియాణా, కేరళ రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు వివరించింది. ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు, కీలకమైన బ్యాంక్ అకౌంట్లు లభించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. పలు రకాల ఆస్తుల ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భారత్‌లో అనేక షెల్ ఎంటీటీలను తెప్పించారని, సింగపూర్‌లోని షెల్ కంపెనీలకు నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంపించారని ED దర్యాప్తులో తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 29 , 2024 | 08:41 PM

Advertising
Advertising