ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Punjab: వారి పాలనలో నేరాలు భారీగా పెరిగాయి.. ఆ పార్టీపై సీఎం చురకలు..

ABN, Publish Date - Jan 05 , 2024 | 10:24 AM

శిరోమణి అకాలీదళ్ పై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్నఅకాలీదళ్.. కనికరం లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండి పడ్డారు.

రోమణి అకాలీదళ్ పై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్నఅకాలీదళ్.. కనికరం లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండి పడ్డారు. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాటు పాలించిన పార్టీ.. నేడు తీవ్ర ఇబ్బందుల్లో ఉందని చురకలు వేశారు. వారు కేవలం మూడు స్థానాలకే పరిమితమయ్యారని, ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని విమర్శించారు. ఆ పార్టీ నేతల స్వభావం గురించి ప్రజలకు బాగా తెలుసన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించరని అన్నారు.

అకాలీల పాలనలో పంజాబ్ అన్ని రంగాల్లో వెనుకబడిందని, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ను అపవిత్రం చేయడం, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ మాఫియాను ప్రోత్సహించడం వంటి విద్రోహ చర్యలకు వారు పాల్పడ్డారని సీఎం భగవంత్ మాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. బుధవారం నాడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంజాబ్ బచావో యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.


అంతకుముందు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి భగవంత్ మాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోయిందని విమర్శించారు. ఆ పార్టీ గ‌త వైభ‌వంగా మారింద‌ని, ఏక్ థి కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. ఈ కామెట్స్ పై స్పందించిన కాంగ్రెస్ భ‌గ‌వంత్ మాన్ ఏక్ థా జోక‌ర్ అని కౌంట‌ర్ ఇచ్చింది.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 05 , 2024 | 10:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising