Rajya Sabha Election: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్
ABN, Publish Date - Jan 29 , 2024 | 02:40 PM
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించింది. ఈ అన్ని స్థానాలకు వచ్చే నెల 27వ తేదీన ఓటింగ్ జరగనుంది.
దేశంలోని 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించింది. ఈ అన్ని స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.
మరోవైపు బిహార్‌లో నితీష్ కుమార్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి పోటీ ఎదుర్కొననుంది. వాస్తవానికి దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. వీరిలో బీహార్‌కు చెందిన ఆరుగురు ఎంపీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రకటన విడుదలైంది.
దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో కూడా పంచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో 3, బీహార్‌లో 6, ఛత్తీస్‌గఢ్‌లో 1, గుజరాత్‌లో 4, హర్యానాలో 1, హిమాచల్‌ప్రదేశ్‌లో 1, కర్ణాటకలో 4 , మధ్యప్రదేశ్‌లో 5 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో 6 సీట్లు, తెలంగాణలో 3 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 10 సీట్లు, ఉత్తరాఖండ్‌లో 1 సీటు, పశ్చిమ బెంగాల్‌లో 5 సీట్లు, ఒడిశాలో 3 సీట్లు, రాజస్థాన్‌లో 3 సీట్లు ఉన్నాయి.
ఇక రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లకు దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15, అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 20, ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. రాజ్యసభ శాశ్వత సంస్థ. సభ్యులలో మూడింట ఒక వంతు మంది ప్రతి రెండు సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు.
Updated Date - Jan 29 , 2024 | 02:54 PM