ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ranveer Singh: మాల్దీవుల వివాదం.. ఎరక్కపోయి ఇరుక్కున్న రణ్‌వీర్ సింగ్

ABN, Publish Date - Jan 08 , 2024 | 04:37 PM

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద ట్వీట్స్ కారణంగా.. భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. మాల్దీవులను బాయ్‌కాట్ చేయాలని భారతీయులు పిలుపునిస్తూ..

Ranveer Singh On Lakshadweep: ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద ట్వీట్స్ కారణంగా.. భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. మాల్దీవులను బాయ్‌కాట్ చేయాలని భారతీయులు పిలుపునిస్తూ, లక్షద్వీప్‌కి మద్దతు తెలుపుతున్నారు. క్రికెటర్లతో పాటు సినీ తారలు సైతం #BoycottMaldives ట్రెండ్‌లో పాల్గొని.. సోషల్ మీడియాలో లక్షద్వీప్‌ అందాలను కొనియాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా రంగంలోకి దిగాడు. లక్షద్వీప్‌ను పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేసేందుకు ముందుకొచ్చాడు. అయితే.. ఈ క్రమంలో రణ్‌వీర్ అనుకోకుండా ఒక పొరపాటు చేశాడు. అందుకు గాను అతడు నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కుంటున్నాడు.


ఈ ఏడాదిలో లక్షద్వీప్‌ను అన్వేషించాలని.. మన భారతీయ సంస్కృతిని ప్రోత్సాహించాలని అభిమానుల్ని రణ్‌వీర్ సింగ్ కోరుతూ.. మాల్దీవులకు చెందిన ఫోటోని షేర్ చేశారు. ఇదే అతడు చేసిన తప్పు. లక్షద్వీప్ ఫోటోకి బదులు మాల్దీవుల ఫోటోని షేర్ చేయడంతో.. ఆ రెండు ప్రాంతాల మధ్య తేడా కూడా తెలియదా అంటూ నెటిజన్లు అతనిపై ఫైర్ అవుతున్నారు. ‘‘ఈ సంవత్సరంలో భారతదేశాన్ని అన్వేషించడంతో పాటు మన సంస్కృతి అనుభూతిని ఆస్వాదిద్దాం. మన దేశంలో అన్వేషించేందుకు ఎన్నో అందాలు, బీచ్‌లు ఉన్నాయి. చలో ఇండియా లెట్స్ #exploreindianislands’’ అంటూ రణ్‌వీర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అయితే.. నెటిజన్లు మాత్రం ఈ పోస్టుని పట్టించుకోకుండా, పొరపాటుగా అతడు పెట్టిన మాల్దీవుల ఫోటోనే టార్గెట్ చేసుకొని, రణ్‌వీర్‌పై విరుచుకుపడుతున్నారు.

మాల్దీవులను బహిష్కరించడానికి రణ్‌వీర్ సింగ్ మాల్దీవుల చిత్రాన్ని ఉపయోగిస్తున్నాడని.. ఈ విషయంలో అతడిది ‘మోయే మోయే పరిస్థితి’ (ఈమధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న మీమ్ మెటీరియల్ ఇది) అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తనపై వచ్చిన ఈ ట్రోల్స్, తాను చేసిన తప్పుని గ్రహించిన రణ్‌వీర్ సింగ్.. వెంటనే ఆ ట్వీట్‌ని తొలగించాడు. ఈసారి ఎలాంటి ఫోటో జత చేయకుండా.. పాత ట్వీట్‌ని మళ్లీ ట్వీట్ చేశాడు. కాగా.. ఈ బాయ్‌కాట్ మాల్దీవుల ట్రెండ్‌లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్‌లతో పాటు ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వెంకటేష్ ప్రసాద్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా పాల్గొన్నారు. మాల్దీవులకు వెళ్లకుండా దేశీయ దీవులను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jan 08 , 2024 | 04:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising