ఎన్‌డీఏలో చేరిన రాష్ట్రీయ లోక్‌దళ్
ABN, Publish Date - Mar 03 , 2024 | 04:59 AM
రాజకీయ వర్గాలు ఊహించిన మాదిరిగానే రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) శనివారం ఎన్‌డీఏ కూటమిలో చేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షంలో
న్యూఢిల్లీ, మార్చి 2: రాజకీయ వర్గాలు ఊహించిన మాదిరిగానే రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) శనివారం ఎన్‌డీఏ కూటమిలో చేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షంలో ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్ చౌధరి ఈ మేరకు లాంఛనంగా ప్రకటించారు. ఆర్‌ఎల్‌డీ ఇంతవరకు విపక్షాలకు చెందిన ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండేది. అయితే దివంగత మాజీ ప్రధాని, తన తాత చౌధరి చరణ్‌సింగ్‌కు మోదీ ప్రభుత్వం భారత రత్న ప్రకటించిన దగ్గర నుంచి జయంత్ వైఖరిలో మార్పు వచ్చింది. ‘దిల్ జీత్ లియా మేరా’ (నా హృదయాన్ని గెలుచుకున్నారు) అని వ్యాఖ్యానించిన ఆయన బీజేపీకి దగ్గర కావడం ప్రారంభించారు. అనుకున్నట్టుగానే ఎన్‌డీఏలో చేరారు. ఉత్తరప్రదేశ్ మేలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
Updated Date - Mar 03 , 2024 | 06:57 AM