RG Kar: నిరాహార దీక్షలో జూడాలు.. ఒకరి పరిస్థితి విషమం
ABN, Publish Date - Oct 11 , 2024 | 03:06 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా(Kolkata) జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఇవాళ్టితో ఆరో రోజుకు చేరుకుంది.
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా(Kolkata) జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఇవాళ్టితో ఆరో రోజుకు చేరుకుంది. అయితే ఇందులో పాల్గొన్న వైద్యుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు వైద్యులు అక్టోబర్ 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వారిలో ఒకరైన అనికేత్ మహతో ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. దీంతో గురువారం రాత్రి అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనికేత్ అక్కడ చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేశామన్నారు.
డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసనలు..
అనికేత్‌తోపాటు నిరాహార దీక్షలో పాల్గొన్న మరో ఆరుగురు వైద్యుల ఆరోగ్యం కూడా క్షీణించినట్లు జూనియర్ వైద్యులు తెలిపారు. వారికి వైద్యం అందించేందుకు దీక్ష జరుగుతున్న ప్రాంతంలో ఐసీయూ, అంబులెన్స్ తదితర వైద్య పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించేవరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని జూడాలు తేల్చిచెప్పారు. దీక్షలో పాల్గొన్న వారికి ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. ఉత్తర బెంగాల్‌లో ఉన్న మరో మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మరో ఇద్దరు జూనియర్ వైద్యులు కూడా అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. "యువ వైద్యులు దేశ భవిష్యత్తు నిర్మాతలు. న్యాయం కోసం నిరాహార దీక్ష చేస్తున్నా దీదీ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితి చేయి దాటేలోపే మా డిమాండ్లను నెరవేర్చాలి" అని బెంగాల్ ప్రభుత్వానికి డాక్టర్లు తేల్చిచెప్పారు.
ఈ ఏడాది ఆగస్టులో ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై ఓ కామాంధుడు హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేశారు. సీఎం మమతా బెనర్జీ తమ డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇవ్వడంతో, 12 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేసి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?
ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు
ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్
ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 11 , 2024 | 03:06 PM