ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bihar politics: నితీష్ సర్కార్‌కు ఆర్జేడీ గుడ్‌బై...గవర్నర్‌ను కలిసే అవకాశం

ABN, Publish Date - Jan 27 , 2024 | 03:31 PM

బీహార్‌‌లోని అధికార 'మహాఘట్బంధన్' ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమవుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో కూటమి భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ సైతం చురుకుగా పావులు కదుపుతోంది. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారంనాడు సమావేశమయ్యారు.

పాట్నా: బీహార్‌ (Bihar) లోని అధికార 'మహాఘట్బంధన్' ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమవుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో కూటమి భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ (RJD) సైతం చురుకుగా పావులు కదుపుతోంది. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారంనాడు సమావేశమయ్యారు. తాజా పరిణామాలను సమీక్షించారు. నితీష్ కుమార్ సారథ్యంలోని బీహార్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని, ఈ మేరకు గవర్నర్‌‌కు లేఖ సమర్పించాలని సమావేశంలో నిర్ణయించినట్టు పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


నితీష్ వ్యూహరచన..

ఆర్జేడీతో పాటు 'ఇండియా' (INDIA) కూటమికి ఉద్వాసన చెప్పడం ద్వారా ఎన్డీయేతో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని, రాష్ట్రంలో బీజేపీతో పొత్తుతో సీఎంగా కొనసాగాలని నితీష్ వ్యూహరచన చేస్తున్నట్టు కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. నితీష్ కుమార్ నుంచి కానీ, ఆర్జేడీ నుంచి కానీ శనివారం మధ్యాహ్నం వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ రెండు పార్టీల మధ్య లుకలుకలు ఉన్నట్టు శుక్రవారంనాడు బయట పడింది. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన 'ఎట్ హోం' కార్యక్రమంలో నితీష్ పాల్గొనగా, ఆయన డిప్యూటీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గైర్హాజరయ్యారు. నితీష్ సైతం బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ఆ పార్టీ విక్షప నేత విజయ్ కుమార్‌తో సహా పలువురు అతిథులతో నవ్వుతూ మాట్లాడటం కనిపించింది. దీనికి ముందు కూడా ఆర్జేడీని నితీష్ నమ్మడం లేదనే వాదనకు బలం చేకూరుస్తూ రాజీవ్ సింగ్ లలన్ స్థానంలో పార్టీ అధ్యక్ష పగ్లాలను నితీష్ గత నెలలో చేపట్టారు. ఆర్జేడీ‌కి లలన్ సింగ్ దగ్గరవుతున్నారని నితీష్ అనుమానించడమే ఈ పరిణామానికి కారణంగా విశ్లేషిస్తున్నారు.

Updated Date - Jan 27 , 2024 | 04:52 PM

Advertising
Advertising