ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోబో సర్జరీ.. కేన్సర్‌ రోగి బలి..!

ABN, Publish Date - Feb 15 , 2024 | 02:56 AM

కేన్సర్‌ చికిత్సలో సర్జికల్‌ రోబోని నమ్ముకుంటే.. అది శస్త్రచికిత్సతోపాటు శరీరంలోని ఇతర అవయవాలకు రంధ్రాలు చేసింది. దీంతో బాధిత మహిళ శస్త్రచికిత్స పూర్తయిన కొద్ది నెలల్లోనే చనిపోయింది.

శస్త్రచికిత్స సమయంలో ఇతర అవయవాలకు రంధ్రాలు

రోబో తయారీ సంస్థపై 75వేల డాలర్లకు దావా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కేన్సర్‌ చికిత్సలో సర్జికల్‌ రోబోని నమ్ముకుంటే.. అది శస్త్రచికిత్సతోపాటు శరీరంలోని ఇతర అవయవాలకు రంధ్రాలు చేసింది. దీంతో బాధిత మహిళ శస్త్రచికిత్స పూర్తయిన కొద్ది నెలల్లోనే చనిపోయింది. సర్జికల్‌ రోబో శరీరంలోని ఇతర అవయవాలకు చేసిన రంధ్రాల కారణంగానే తన భార్య చనిపోయిందంటూ మృతురాలి భర్త కోర్టులో దావా వేశారు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. హార్వే సల్జర్‌ భార్య శాండ్రా సల్జర్‌ కొన్నాళ్లుగా పెద్దపేగు కేన్సర్‌తో బాధపడుతూ.. బాప్టిస్ట్‌ హెల్త్‌ బోకా రాటన్‌ రీజినల్‌ హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ఆమెకు అనేక చేతులు ఉండి, రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే అధునాతన డావిన్సీ రోబోతో సర్జరీ చేయాలని నిర్ణయించారు. 2021 సెప్టెంబరులో ఆమెకు రోబోటిక్‌ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కేన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకోవాల్సిన ఆమె 2022 ఫిబ్రవరిలోనే మరణించింది. ఆపరేషన్‌ సమయంలో ఇతర అవ యవాలకు రోబో చేసిన గాయాల కారణంగానే తన భార్య చనిపోయిం దని సల్జర్‌ ఆరోపించారు. ఈ రోబోకు సాంకేతిక సమస్యలున్నాయని అనేక ఫిర్యాదులు అందినప్పటికీ దాని తయారీ సంస్థ ఇంట్యూటివ్‌ సర్జికల్స్‌ వాటిని సరిచేయకుండా కప్పిపుచ్చిందని ఆరోపించారు. రోబో వినియోగంపై ఆ సంస్థ వైద్యులకు తగిన శిక్షణ ఇవ్వలేదన్నారు. వైద్యం లో నిర్లక్ష్యం, డిజైన్‌ లోపం తదితర అంశాలు తన భార్య మరణానికి కారణమయ్యాయని, దీనికోసం తనకు 75వేల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆ సంస్థపై సల్జర్‌ దావా వేశారు.

Updated Date - Feb 15 , 2024 | 07:47 AM

Advertising
Advertising