ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Seema Haider: సీమా హైదర్ నెత్తిన పెద్ద పిడుగు.. ఏకంగా రూ.3 కోట్ల నోటీసు!

ABN, Publish Date - Mar 04 , 2024 | 09:24 PM

సీమా హైదర్ (Seema Haider).. ఈ పేరు తెలియని భారతీయులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే.. ఆమె సృష్టించిన అలజడి అలాంటిది. పబ్‌జీ (PubG) ద్వారా పరిచయమైన ప్రేమికుడు సచిన్ (Sachin) కోసం.. భర్తని వదిలేసి, పాకిస్తాన్ (Pakistan) నుంచి భారత్‌కు (India) అక్రమంగా వచ్చింది. సచిన్‌ని పెళ్లి చేసుకొని, హిందూ ధర్మాన్ని స్వీకరించింది. క్రమంగా ఆమె సెలెబ్రిటీగా ఎదిగింది. ఇలా మూడు పువ్వులు ఆరు కాయల్లా జీవితం కొనసాగిస్తున్న ఆమెకు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది.

సీమా హైదర్ (Seema Haider).. ఈ పేరు తెలియని భారతీయులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే.. ఆమె సృష్టించిన అలజడి అలాంటిది. పబ్‌జీ (PubG) ద్వారా పరిచయమైన ప్రేమికుడు సచిన్ (Sachin) కోసం.. భర్తని వదిలేసి, పాకిస్తాన్ (Pakistan) నుంచి భారత్‌కు (India) అక్రమంగా వచ్చింది. సచిన్‌ని పెళ్లి చేసుకొని, హిందూ ధర్మాన్ని స్వీకరించింది. క్రమంగా ఆమె సెలెబ్రిటీగా ఎదిగింది. ఇలా మూడు పువ్వులు ఆరు కాయల్లా జీవితం కొనసాగిస్తున్న ఆమెకు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది.

తాజా సమాచారం ప్రకారం.. సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ (Ghulam Haider) ఆమెకు, అలాగే ఆమె రెండో భర్త సచిన్‌కు రూ.3 కోట్ల చొప్పున నోటీసులు పంపించాడు. ఇంతవరకూ చట్టపరంగా విడాకులు తీసుకోని నేపథ్యంలో.. ఆయన ఈ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు.. గులాం తరఫు న్యాయవాది మోమిన్ మాలిక్ (Momin Malik) కూడా సీమా తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌కు రూ.5 కోట్ల నోటీసు పంపారు. ఒక నెల రోజుల లోపు వీళ్లు ముగ్గురూ క్షమాపణలు చెప్పాలని, అలాగే తాము డిమాండ్ చేసిన జరిమానా జమ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తాము చెప్పినట్లు చేయకపోతే.. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.


సీమా హైదర్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు తన భర్త గులాం హైదర్ అని పేర్కొందని, అలాగే ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలన్నింటిలోనూ తాను గులాం హైదర్ భార్య అని రాసి ఉందని మోమిన్ మాలిక్ తెలిపారు. అంతేకాదు.. కోర్టు నుంచి బెయిల్ పొందినప్పుడు సైతం సీమా భర్త గులాం అని ప్రస్తావించబడిందని గుర్తు చేశారు. తనని తాను గులాం భార్యగానూ సీమా చెప్పుకుందని వెల్లడించారు. కానీ.. తనని తాను సీమా సోదరుడినని చెప్పుకుంటున్న ఏపీ సింగ్.. సీమా హైదర్ సచిన్ భార్య అని చెప్తున్నాడని.. ఏ ప్రాతిపదికన అతడలా అంటున్నాడని ప్రశ్నించారు. ఈ కారణం చేతనే ఏపీ సింగ్‌కు రూ.5 కోట్ల నోటీసులు పంపినట్లు ఆయన వివరణ ఇచ్చారు.

ఇప్పటివరకు గులాం హైదర్, సీమా హైదర్ చట్టపరంగా విడాకులు తీసుకోలేదని.. అలాంటప్పుడు సచిన్ ఏ విధంగా సీమా హైదర్‌ను తన భార్యగా చెప్పుకుంటున్నాడని మోమిన్ మాలిక్ నిలదీశారు. సచిన్ కారణంగా గులాంకు నలుగురు పిల్లలు దూరమయ్యారని, ఆ పిల్లల చదువులు కూడా దిగజారుతున్నాయని చెప్పారు. సీమాతో సచిన్ అక్రమంగా జీవిస్తున్నాడని మండిపడ్డారు. ఇదే సమయంలో గులాం మాట్లాడుతూ.. తాను, సీమా చట్టపరంగా విడాకులు తీసుకోలేదన్నాడు. సీమా భారత్‌కు రావడం వల్ల తనకు పిల్లలు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తాము నోటీసులు పంపామని చెప్పుకొచ్చాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2024 | 09:24 PM

Advertising
Advertising