ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Supreme Court: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ..

ABN, Publish Date - Feb 02 , 2024 | 11:26 AM

మనీలాండరింగ్(Money Laundering) కేసులో తన అరెస్టును సవాలు చేసిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌(Hemanth Sorean)కు సుప్రీంకోర్టు(Supreme Court) షాక్ ఇచ్చింది.

ఢిల్లీ: మనీలాండరింగ్(Money Laundering) కేసులో తన అరెస్టును సవాలు చేసిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌(Hemanth Sorean)కు సుప్రీంకోర్టు(Supreme Court) షాక్ ఇచ్చింది. ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తూ శుక్రవారం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ని అరెస్ట్ చేసింది.


కేసు నేపథ్యం ఇదీ..

జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడి అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసింది. అరెస్టు తప్పదని తేలడంతో రాజ్ భవన్‌లో ఆయన రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. అక్కడే ఉన్న ఈడీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. తొలుత హైకోర్టును ఆశ్రయించిన హేమంత్.. తరువాత పిటిషన్‌ని వెనక్కి తీసుకుని సుప్రీం తలుపు తట్టారు.

ఆయన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. తీర్పు వెలువరించింది. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో సోరెన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. ఇప్పటికే జేఎంఎం, కాంగ్రెస్‌కు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు తమ తదుపరి సీఎంగా మంత్రి చంపయి సోరెన్‌కు మద్దతు తెలిపారు. శుక్రవారం గవర్నర్ సమక్షంలో సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 02 , 2024 | 11:48 AM

Advertising
Advertising