ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పాము విషానికి సింథటిక్‌ హ్యూమన్‌ యాంటీబాడీ

ABN, Publish Date - Feb 23 , 2024 | 05:37 AM

పాము కాటు వల్ల ఏటా వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ మంది పాముకాటుకు గురవుతున్నారు.

అభివృద్ధి చేసిన ఇండో-అమెరికా పరిశోధకులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పాము కాటు వల్ల ఏటా వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ మంది పాముకాటుకు గురవుతున్నారు. అయితే.. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా అంతటా కనిపించే నాగుపాటు, కింగ్‌ కోబ్రా, బ్లాక్‌ మాంబాతో సహా అత్యంత విషపూరిత పాములు ఉత్పత్తి చేసే శక్తివంతమైన న్యూరోటాక్సిన్లను నిర్వీర్యం చేయగల సింథటిక్‌ హ్యూమన్‌ యాంటీబాడీల (ప్రతిరోధకాలు)ను బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎ్‌ససీ), అమెరికాలోని స్ర్కిప్స్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా అభివృద్ధి చేసింది. దీనికోసం పరిశోధకులు... హెచ్‌ఐవీ, కొవిడ్‌-19కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను పరీక్షించడానికి గతంలో ఉపయోగించిన విధానాన్ని అనుసరించారు. గతంలోగుర్రాలు, గాడిదలకు ముందుగా పాము విషం ఎక్కించి.. ఆ తర్వాత వాటి రక్తాన్ని సేకరించి యాంటీబాడీలు అభివృద్ధి చేసేవారు. సైన్స్‌ ట్రాన్స్‌ప్లాంటేషనల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. పరిశోధకులు అభివృద్ధి చేసిన సింథటిక్‌ హ్యూమన్‌ యాంటీబాడీలు వివిధ రకాల పాము విషాల నుంచి రక్షణ అందించగల సార్వత్రిక యాంటీబాడీ ద్రావణాల తయారీకి మరో ముందడుగు అని పరిశోధకులు తెలిపారు.

Updated Date - Feb 23 , 2024 | 05:37 AM

Advertising
Advertising