ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: దేశ ప్రజలకు అలర్ట్.. ఈ 7 రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక

ABN, Publish Date - Apr 01 , 2024 | 06:11 PM

వేసవి కాలం(Summer Season) కావడంతో దేశ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో భారత్ తీవ్రమైన వేడి గాలులను ఎదుర్కొంటుందని తెలిపింది. ఏప్రిల్ 19 నుంచి దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందునా ఐఎండీ(IMD) కీలక సూచనలు జారీ చేసింది.

ఢిల్లీ: వేసవి కాలం(Summer Season) కావడంతో దేశ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో భారత్ తీవ్రమైన వేడి గాలులను ఎదుర్కొంటుందని తెలిపింది. ఏప్రిల్ 19 నుంచి దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందునా ఐఎండీ(IMD) కీలక సూచనలు జారీ చేసింది. భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ..

"మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో చాలా ప్రాంతాలలో వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజులపాటు వేడిగాలులు వీస్తాయి. సాధారణ స్థాయి నాలుగు నుంచి ఎనిమిది రోజుల వరకు ఉంటుంది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.


ఇదే నెలలో మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, ఉత్తర మైదానాలు, దక్షిణ భారత్‌లోని పరిసర ప్రాంతాలలో సాధారణ కంటే ఎక్కువ వేడిగాలులు వీస్తాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో ఏప్రిల్‌లో వేడి తరంగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది" అని మృత్యుంజయ్ అంచనా వేశారు.

GST: జీఎస్టీ వసూళ్లలో చరిత్ర సృష్టించిన భారత్.. ఇది రెండో రికార్డ్

ప్రజలు వేడిగాలుల ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవాలని.. బయట ఎక్కువగా తిరగకూడదని డాక్టర్లు చెబుతున్నారు. శీతల పానీయాలు తాగాలని.. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారు డాక్టర్‌ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 06:14 PM

Advertising
Advertising