ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eknath Shinde: ఇది ట్రైలరే..ముందుంది సినిమా

ABN, Publish Date - Jan 14 , 2024 | 09:18 PM

'ఇది ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా'' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవర ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీనిపై ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, అసలు సినిమా ముందుందంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు మరిన్ని చేరికలు ఉండబోతున్నాయనే సంకేతాలిచ్చారు.

ముంబై: 'ఇది ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా'' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవర ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీనిపై ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, అసలు సినిమా ముందుందంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు మరిన్ని చేరికలు ఉండబోతున్నాయనే సంకేతాలిచ్చారు.


ఏడాదిన్నర క్రితం తాను ఒక ఆపరేషన్ చేశానని, కుట్లు కూడా వేయకుండా ఆపరేషన్ జరిపానని ఆయన అప్పట్లో శివసేన నుంచి బయటకు వచ్చి 30కి పైగా ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతిచ్చిన ఘట్టాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు. ''నేను డాక్టర్‌ను కాను. అయినా ఏడాదిన్నర క్రితం ఒక ఆపరేషన్ చేశాను. కుట్లు వేయకుండానే ఆపరేషన్ జరిగింది. అంతకంటే ఏమీ చెప్పలేను. ఇది ట్రయిలర్ మాత్రమే, ఫిల్మ్ ఇంకా రావాల్సి ఉంది'' అని సీఎం నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈరోజు మిలింద్ ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారో ఏడాదిన్నర క్రితం తను కూడా అలాగే భావించానని, అప్పటి సీఎం ఉద్ధవ్ థాకరేతో తెగతెంపులు చేసుకున్నానని చెప్పారు.

Updated Date - Jan 14 , 2024 | 09:18 PM

Advertising
Advertising