ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిహాడ్‌ జైలు వార్డెన్‌ డ్రగ్స్‌ దందా

ABN, Publish Date - Oct 30 , 2024 | 05:54 AM

గ్రేటర్‌ నోయిడాలో తిహాడ్‌ జైలు వార్డెన్‌ రహస్యంగా నడుపుతున్న మాదకద్రవ్యాల తయారీ ల్యాబ్‌ గుట్టురట్టయింది.

మాదక ద్రవ్యాల కేసులో

జైలుకొచ్చిన ఓ వ్యక్తితో పరిచయం

అతడు విడుదలయ్యాక కలిసి వ్యాపారం

డ్రగ్స్‌ ల్యాబ్‌ నెలకొల్పి పెద్ద ఎత్తున తయారీ

సమాచారం తెలిసి ఎన్‌సీబీ దాడి

వీరితో పాటు మరో ఇద్దరి అరెస్టు

వందల కోట్ల విలువైన 95 కేజీల డ్రగ్స్‌ సీజ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 29: గ్రేటర్‌ నోయిడాలో తిహాడ్‌ జైలు వార్డెన్‌ రహస్యంగా నడుపుతున్న మాదకద్రవ్యాల తయారీ ల్యాబ్‌ గుట్టురట్టయింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తతో కలిసి ఆ వార్డెన్‌ ఇంతకాలం ఈ డ్రగ్‌ దందా నడిపారు. గౌతమ్‌బుద్ధ నగర్‌ జిల్లా కాసనా ఇండస్ట్రీయల్‌ ప్రాంతంలో అనధికార డ్రగ్‌ ల్యాబ్‌ ఉన్నట్లు సమాచారం అందడంతో ఇటీవల ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగంతో కలిసి ఎన్‌సీబీ ఆ ప్రాంతంలో రైడ్స్‌ నిర్వహించింది. దాంతో ఈ డ్రగ్‌ ల్యాబ్‌ వ్యవహారం బట్టబయలైంది. రైడ్‌ సమయంలో ఢిల్లీ వ్యాపారి అక్కడే ఉన్నారు. తిహాడ్‌ జైలు వార్డెన్‌తో కలిసి ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ముంబైకి చెందిన ఓ కెమి్‌స్టతో అక్కడ మెఽథాంపెటమైన్‌ డ్రగ్‌ తయారు చేయిస్తున్నారని, ఢిల్లీలో ఉంటున్న ఒక మెక్సికన్‌ డ్రగ్‌ సప్లయర్‌తో దాని నాణ్యత చెక్‌ చేయిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో దాదాపు 95 కేజీల మెఽథాంపెటమైన్‌ డ్రగ్‌(ద్రవ, ఘన రూపాల్లో)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుంది.

Updated Date - Oct 30 , 2024 | 05:54 AM